Home » తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు ఇవే..!

తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు ఇవే..!

by Anji

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్ కి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు మీడియాకి వెల్లడించారు. దళితబంధుపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుందని.. లక్ష30వేల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని కేబినేట్ నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. 

Also Read :  ఎన్టీఆర్ ‘దాన వీరశూరకర్ణ’ కు బడ్జెట్ కంటే 15 రేట్లు ఎక్కువ లాభాలు…

గృహలక్ష్మీ పథకం ద్వారా రూ.4లక్షల మంది పేదలకు ఇళ్లు ఇస్తాం. నియోజకవర్గానికి రూ.3వేల చొప్పున ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. లబ్ధిదారునికి రూ.3లక్షల గ్రాంట్ ఇస్తాం అని హరీశ్ రావు పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక వెంటనే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రూ.4లక్షల ఎకరాల పోరు భూములకు పట్టాలు ఇవ్వాలని కేబినేట్ నిర్ణయించిందని హరీశ్ రావు వెల్లడించారు. 

Also Read :   కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఈ 5 అలవాట్లను తప్పక పాటించండి..!

ఈ సమావేశంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన ఇద్దరినీ ఖరారు చేయడంతో పాటు గవర్నర్ వద్ద పెండిగ్ లో ఉన్నటువంటి కీలక బిల్లులపై చర్చించినట్టు కూడా సమాచారం. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు  జారీ చేసిన అంశం పై భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈడీ విచారణ సందర్భంగా కవితను ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎలా స్పందించాలి..? కేంద్రం రాష్ట్రంపై వ్యవహరిస్తున్న కక్ష సాధింపు చర్యలపై మున్ముందు ఎలాంటి ముందుకెళ్లాలన్న అంశంపై చర్చ కొనసాగినట్టు సమాచారం. 

Also Read :  ఆస్కార్ కోసం రాజమౌళి ఖర్చుపై తమ్మారెడ్డి భరద్వాజ ఏమన్నారంటే..?

Visitors Are Also Reading