Home » జూన్ 2 వరకే ఉమ్మడి రాజధానిగా.. ఆ తర్వాత‌ హైదరాబాద్‌‌ కేంద్ర పాలిత ప్రాంతం: కేటీఆర్

జూన్ 2 వరకే ఉమ్మడి రాజధానిగా.. ఆ తర్వాత‌ హైదరాబాద్‌‌ కేంద్ర పాలిత ప్రాంతం: కేటీఆర్

by Sravya
Ad

తెలంగాణలో లోక్సభ ఎన్నికల హీట్ మామూలుగా అయితే లేదు. ప్రచారంలో జోరు పెరిగింది. నేతలు మాటలు కూడా హీట్ ఎక్కేలా ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్ చేసారు. ఈ సంవత్సరం జూన్ రెండు వరకు హైదరాబాద్ నగరం అని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తర్వాత కాంగ్రెస్ బీజెపి కలిసి హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని కేటీఆర్ చెప్పారు.

KCR

హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకునేది కేవలం బీఆర్ ఎస్ పార్టీ మాత్రం అని కేటీఆర్ చెప్పారు. బీజేపీ అరాచకాలనీ అడ్డుకునే శక్తి కేవలం బీఆర్ఎస్ కి మాత్రమే ఉందని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవ్వకుండా అడ్డుకుంటామని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఇందుకోసం లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Advertisement

Also read;

Also read:

కేటీఆర్ 2026 నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తెలంగాణకి అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి కూడా బీఆర్ఎస్ కి మాత్రమే ఉందని అన్నారు. కేటీఆర్ బిజెపి రాజ్యాంగం మార్చకుండా ఆపే పవర్ బీఆర్ఎస్ కి ఉందని అన్నారు ఏడాదిలోగా తెలంగాణని మళ్లీ కేసిఆర్ శాసించే రోజులు రావాలి అంటే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ ని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading