Home » వాస్త‌వం ఏమిటో నాకు తెలుసు.. కానీ న‌న్ను న‌మ్మేవారే లేరు.. రాహుల్ సిప్లిగంజ్ ఎమోష‌న‌ల్..!

వాస్త‌వం ఏమిటో నాకు తెలుసు.. కానీ న‌న్ను న‌మ్మేవారే లేరు.. రాహుల్ సిప్లిగంజ్ ఎమోష‌న‌ల్..!

by Anji
Ad

సినీ ఇండ‌స్ట్రీలో డ్ర‌&ggs ఇష్యూ అనేది చాలా కాలంగా ఉన్న స‌మ‌స్య ఇప్పుడు పెద్ద మిస్ట‌రీగా మారింది. ఇది వ‌ర‌కే దీనిపై ప‌లువురు సినీ తార‌ల‌పై విచార‌ణ కూడా కొన‌సాగింది. మొన్న‌టికి మొన్న హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాడిస‌న్ బ్లూ హోట‌ల్‌లో అర్థ‌రాత్రి వేళ జ‌రిగిన పోలీసుల దాడిలో మెగా డాట‌ర్ నిహారిక బిగ్ బాస్ సీజ‌న్ -3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ దొరికిపోవ‌డం.. ఆ ప‌బ్‌లో విచ్ఛ‌ల‌విడిగా డ్ర‌&ggs వాడార‌ని పోలీసులు చెబుతుండ‌డం సినీ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ త‌రుణంలో ఇదే ఇష్యూపై రాహుల్ సిప్లిగంజ్ పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది.


ఉన్న‌ట్టుండి అర్థ‌రాత్రి వేళ ఒక్క‌సారిగా టాస్క్ పోర్స్ పోలీసులు దాడి చేసి సుమారు 150 మంది యువ‌తీ, యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ దాడిలో ప‌ట్టుబ‌డిన రాహుల్‌సిప్లిగంజ్‌, నిహారిక విచార‌ణ ఎదుర్కున్న త‌రువాత పోలీస్ స్టేష‌న్ నుంచి బ‌య‌టికి వ‌చ్చారు. ఈ ఇష్యూలో నిహారిక త‌ప్పు ఏమి లేద‌ని.. నాగ‌బాబు రియాక్ట్ కాగా.. తాను ఎలాంటివి తీసుకోలేద‌ని.. కావాలంటే త‌న‌ను ప‌రీక్ష కూడా చేసుకోండి అని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు.

Advertisement

Advertisement

రాహుల్‌కు రెగ్యుల‌ర్‌గా ప‌బ్‌కు వెళ్లే అల‌వాటు ఉండ‌డంతో.. డ్ర‌&ggs ఇష్యూ పై ఓ రేంజ్ చ‌ర్చ కొన‌సాగుతుంది. ఈ వ్య‌వ‌హారంలో త‌న‌కు సంబంధం లేద‌ని మొత్తుకున్నా కూడా ఆయ‌న‌పై మాత్రం ట్రోలింగ్ ఆగ‌డం లేదు. తాజాగా త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ అదే అంశంపై ప‌రోక్షంగా రాహుల్ స్పందించారు. న‌న్ను న‌మ్మి నిజాన్ని అర్థం చేసుకోవ‌డానికి ఎవరూ సిద్ధంగా లేరు. నా మీద నాకు న‌మ్మ‌కం ఉంది. నిజం ఏమిటో నాకు తెలుసు అని కాస్త ఎమోష‌న‌ల్‌గా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు రాహుల్ సిప్లిగంజ్‌.

Also Read :  భోజ‌నం త‌రువాత గంట సేప‌టి వ‌ర‌కు ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కూడ‌దు

Visitors Are Also Reading