Home » భోజ‌నం త‌రువాత గంట సేప‌టి వ‌ర‌కు ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కూడ‌దు

భోజ‌నం త‌రువాత గంట సేప‌టి వ‌ర‌కు ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కూడ‌దు

by Anji

రోజు వారీ కార్య‌క‌లాపాలు, తీసుకునే ఆహార‌మే మ‌న‌కు ఆరోగ్యంగా ఉంచ‌డంతో పాటు ఏ ముప్పు లేకుండా కాపాడుతాయి. ఆద‌రాబాద‌ర‌గా తిన‌డం.. తిన్న త‌రువాత చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తుండ‌డం మ‌న ఆరోగ్యాన్ని మ‌న‌మే చేజేతులా పాడు చేసుకుంటున్నామ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. మ‌న‌లో చాలా మందికి తిన్న త‌రువాత‌నే ప‌డుకోవ‌డం.. స్విమ్మింగ్ చేయ‌డం.. వ్యాయామం చేయ‌డం వంటివి అల‌వాటు. ఇవే కొంప ముంచుతాయి అంటున్నారు నిపుణులు. భోజ‌నం చేసిన త‌రువాత మ‌నం ఏమి చేయ‌కూడ‌ద‌నో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాయామం అస్స‌లు వ‌ద్దు

భోజ‌నం చేసిన వెంట‌నే వ్యాయామం చేయ‌డం అంటే కొత్త రోగాల‌ను కొని తెచ్చుకోవ‌డ‌మే అంటున్నారు న్యూట్రిష‌న్లు. వ్యాయామం చేయ‌క ముందు గానీ.. చేసిన త‌రువాత కానీ.. తిన‌డానికి రెండు గంట‌ల స‌మ‌యం కేటాయించాల‌ని చెబుతున్నారు. తిన్న వెంట‌నే వ్యాయామం చేస్తే.. అది క‌డుపు వికారం చెంద‌డం, తిమ్మిర్లు రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అయితే సాధార‌ణ న‌డ‌క‌తో పెద్ద‌గా న‌ష్టాలు ఏమి ఉండ‌వు అని సూచిస్తున్నారు.

స్విమ్మింగ్ చేయ‌వ‌ద్దు

తిన్న వెంట‌నే ఈత కొట్ట‌డం చాలా ప్ర‌మాద‌క‌రం. దీని ద్వారా క‌డుపు తిమ్మిరికి వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌. తిన్న త‌రువాత స్విమ్మింగ్ చేస్తే జీర్ణ‌క్రియ బాగా ప‌ని చేస్తుంద‌ని పేర్కొంటారు. స్విమ్మింగ్‌కు జీర్ణ‌క్రియ‌కు సంబంధం లేద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక నిద్ర పోతే అంతే..!

మ‌న‌లో చాలా మందికి తిన్న వెంట‌నే ఓ కునుకు తీయాల‌నిపిస్తుంది. పుష్టిగా భోజ‌నం చేసిన త‌రువాత నిద్ర ముంచుకువ‌స్తుంటే ఎవ‌రు ఆపుతారు..? ఎంత ప‌ని ఉన్నా స‌రే..? ఇక ఇర‌వై నిమిషాలు అయినా ప‌డుకుంటాం అనుకుంటారు. ఇక రాత్రి పూట అయితే వేరే చెప్పాలా..? కానీ ఇది అత్యంత ప్ర‌మాద‌క‌రం. తిన్న త‌రువాత నిద్ర‌పోతే అది ఊబ‌కాయానికి బాట‌లు వేసిన‌ట్టే.. అంతేకాదు గుండెల్లో మంట‌, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయ‌ట‌. తిన్న త‌రువాత క‌నీసం రెండు గంట‌లు అయినా వేచి ఉండాల‌ని.. అప్పుడే నిద్ర పోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

స్నానం చేయ‌వ‌ద్దు :

 

ఏదైనా ఆహారం తీసుకున్న వెంట‌నే స్నానం చేయ‌డం కూడా ప్ర‌మాద‌మేన‌ట‌. అది మ‌న శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను అమాంతం పెంచుతుంద‌ట‌. ఈ త‌రుణంలో తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే ప‌నిలో ఉండే జీర్ణ‌క్రియ‌కు ఆటంకం క‌లిగించిన‌ట్టేన‌ట‌. దీంతో ఇది దాని ప‌ని స‌క్ర‌మంగా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల లేనిపోని రోగాలు త‌లెత్తే అవ‌కాశాలు ఎక్కువ‌ట‌. తిన్న త‌రువాత క‌నీసం 30 నిమిషాల నుంచి గంట దాకా స్నానం గురించి మ‌రిచిపోతే మంచిద‌ని నిపుణుల సూచ‌న‌.

బెల్ట్ పెట్టుకోవ‌ద్దు

చాలా మంది ఉద్యోగ‌స్తులు ఆఫీసుల్లో లంచ్ చేసేట‌ప్పుడు బెల్ట్ పెట్టుకునే భోజ‌నం కానించేస్తారు. కానీ అలా చేయ‌కూడ‌దు అంట‌. తినేట‌ప్పుడు క‌డుపును నిర్భందిస్తే.. జీర్ణ‌క్రియ‌ను స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. తినే స‌మ‌యంలో బెల్ట్ ను వ‌దులు చేసుకోవ‌డం లేదా పూర్తిగా తీసేయ‌డం ఇంకా మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read :  మెగాస్టార్‌ గాడ్ ఫాద‌ర్‌లో పూరిజ‌గ‌న్నాథ్‌.. సెట్స్‌లో పూరికి చిరంజీవి స్వాగ‌తం

Visitors Are Also Reading