Home » Elon Musk : అప్పుడు డేటింగ్‌తో చిచ్చు.. ఇప్పుడేమో ఇలా..!

Elon Musk : అప్పుడు డేటింగ్‌తో చిచ్చు.. ఇప్పుడేమో ఇలా..!

by Anji
Published: Last Updated on
Ad

ఎలన్ మాస్క్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆయ‌న చేసిన ఓ రీట్వీట్ ఎక్కువ విమ‌ర్శ‌ల‌కే దారి తీసింది. హాలీవుడ్ సెలబ్రిటీ ఎక్స్ క‌పుల్ జానీ డెప్‌-అంబ‌ర్ హార్డ్ కోర్ట‌కెక్కిన వ్య‌వ‌హారంపై తొలిసారి బ‌హిరంగంగా స్పందించాడు ఎల‌న్ మాస్క్‌. డెప్ హార్డ్ దావా వ్య‌వహారంలో కోర్టులో వాద‌న‌లు కొన‌సాగాయి. జ్యూరీ త‌దుప‌రి చ‌ర్చ‌లు మొదలు పెట్టింది. ఎలన్ మాస్క్ ఓ ట్వీట్ చేసాడు. ఇద్ద‌రూ ఉత్త‌మమైన వ్య‌క్తిత్వాలు ఉన్న అద్భుత‌మైన వ్య‌క్తుల‌ని వారిద్ద‌రూ జీవితంలో ముందుకు సాగాల‌ని ఆశిస్తున్న‌ట్టు ఓ ట్వీట్‌కి రీట్వీట్ చేసాడు. దీంతో కాపురంలో చిచ్చు పెట్టి.. ఇప్పుడు ఓదారుస్తున్నాడంటూ ప లువురు మండిప డుతున్నారు.


కోర్టులో వాద‌న‌ల సంద‌ర్భంగా.. డెప్ త‌న మాజీ టాలెంట్ మేనేజ‌ర్ అయిన క్రిస్టియ‌న్ కార్నిన్నోకు పంపిన ఓ సందేశం హైలెట్ అయింది. అందులో హార్డ్‌, ఎల‌న్ మ‌స్క్ మ‌ధ్య ఎఫైర్ గురించి ప్ర‌స్తావ‌న ఉంది. అస‌భ్య‌మైన ప‌ద‌జాలంతో అందులో మ‌స్క్ ను తిట్టాడు డెప్‌.ఇదిలా ఉండ‌గా.. 2015 లో జానీ డెప్‌, అంబ‌ర్ హార్డ్‌ల వివాహం జ‌రిగింది. కానీ ఏడాదికే వాళ్ల కాపురంలో మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌ల‌య్యాయి.

Advertisement

Advertisement

దాదాపుగా ఆ స‌మ‌యంలోనే న‌టి అంబ‌ర్ హార్డ్‌తో కొంత కాలం డేటింగ్ చేసాడు ఎల‌న్ మాస్క్‌. ఆయన డేటింగ్‌తో ఆ గొడ‌వ‌లు మ‌రింత ముదిరాయ‌న్న‌ది జానీ డెప్ ఆరోప‌ణ‌. అంతేకాదు ఆమె కోర్టు ఫీజును ఎలన్ మాస్క్ చెల్లిస్తున్నాడంటూ చెబుతున్నాడు. ఇదిలా ఉండ‌గా.. హాలీవుడ్ ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమాన‌గ‌ణం సంపాదించుకున్న ఈ మాజీ భార్య‌భ‌ర్త‌లు.. ఒక‌రి మీద ఒక‌రు ప‌రువు న‌ష్టం దావాతో వ‌ర్జీనియా ఫెయిర్ ఫాక్స్ కౌంటీ కోర్టుకెక్క‌డ‌మే కాదు. యాక్టింగ్ ప్రొఫెషన్‌కు భారీగా డ్యామెజ్ తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: 

అదృష్టం అంటే ఆ మూడు రాశుల వారిదే.. జూన్‌లో వారికి అన్ని విజయాలే..!

మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా రాణించిన ఎనిమిది మంది స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా..?

 

Visitors Are Also Reading