Home » మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా రాణించిన ఎనిమిది మంది స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా..?

మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా రాణించిన ఎనిమిది మంది స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

రాజకీయాల్లో రాణించడం అనేది చిన్న విషయం అయితే కాదు. అందులో రాణించి ఇంకా మంత్రి, ముఖ్య మంత్రి పదవులను పొందడం అనేది అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చాలామంది నటీనటులు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం..?
మహానటుడు నందమూరి తారక రామారావు :
సీనియర్ ఎన్టీఆర్ గారు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని, ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి చూపించిన ఘనత ఆయనకే దక్కింది.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి :
సినిమాలలో నటించి స్టార్డమ్ తెచ్చుకున్న చిరంజీవి, మెగాస్టార్ గా మారారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆయన సినిమాల్లో సక్సెస్ అయినంతగా రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు. కొద్దిరోజులకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా రెండు సంవత్సరాలు పనిచేశారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు:
ఎన్నో సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానుల ఆదరాభిమానాలు పొందిన హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఆయన ఎంపీగా గెలుపొందిన కేంద్రంలో నాలుగు సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకు దక్కింది.

Advertisement

డైరెక్టర్ దాసరి నారాయణరావు:

ఈయన డైరెక్షన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి రాజకీయాల్లో రాణించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా పని చేశారు.

కమెడియన్ బాబు మోహన్ :

ఈయన తన కామెడీతో కేంద్రంలో నవ్వించి వేలాది మంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు కమెడియన్ బాబు మోహన్. ఆయన చంద్రబాబు క్యాబినెట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు.

జయలలిత :
తెలుగులో మరియు తమిళంలో స్టార్ హీరోయిన్ గా రాణించిన జయలలిత అన్నాడీఎంకే పార్టీలో ఆమె తమిళనాడు రాష్ట్రానికి మొత్తం ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకు దక్కింది.

 

రోజా :
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన రోజా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో మంత్రిగా చేస్తున్నారు.

Visitors Are Also Reading