సాధారణంగా చాలా మందికి కోరికలు ఉండడం సహజం. కానీ కొంత మందికి ఆశ చాలా పెద్దది. అత్యాశకు పోయి మోసపోయిన ఘటనలు మనం చాలానే చూస్తున్నాం. అయినప్పటికీ చాలా మంది మోసపోతూనే ఉన్నారు. ఇలాంటి ఓ ఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : సమంత జ్ఞాపకాలను దూరం చేసుకుంటున్న చైతూ..ఈసారి ఏం చేశాడంటే..?
Advertisement
ఓ యువతి అధికారికి ఫోన్ చేసింది. తక్కువ సమయంలోనేే కోట్లు సంపాదించవచ్చని నమ్మబలికింది. యువతి మాటలు నమ్మిన ఆ అధికారి పలుమార్లు డబ్బులు చెల్లించాడు. చివరికీ మోసపోయినట్టు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమాజిగూడలో చోటు చేసుకుంది ఈ ఘటన. వివరాల్లోకి వెళ్లితే.. సోమాజిగూడలోని విద్యుత్ బోర్డు కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధికారికి సోషల్ మీడియా ద్వారా ప్రియాంక అనే యువతి పరిచయం అయింది.
Advertisement
Also Read : ugadi pacchadi: ఉగాది పచ్చడీ తీసుకోకపోతే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్టే..!
తనది ఏపీలోని పిడుగురాళ్ల అని,ఐదేళ్లుగా ఆన్ లైన్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ లో ఉన్నానని అధికారిని నమ్మబలికింది. చాలా లాభాలున్నాయని, తక్కువ వ్యవధిలోనే కోట్లు సంపాదించవచ్చని ఆశచూపింది. యువతి మాటలు నమ్మిన అధికారి ఆమె సూచించిన ఓ యాప్ లో ఫస్ట్ రూ.10వేలు పెట్టుబడి కోసం డిపాజిట్ చేశాడు. వాటికి రోజుల వ్యవధిలోనే లాభాలు వస్తున్నట్టు కనిపించడంతో పెట్టుబడి పెంచుతూ వెళ్లాడు. అలా మొత్తం రూ.10వేలు పెట్టుబడి డిపాజిట్ చేశాడు. ఇక ఆ తరువాత నుంచి యాప్ మాయం కావడం, యువతి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో మోసపోయానని గ్రహించి సైబర్ Criమ్ లో ఫిర్యాదు చేసాడు.
Also Read : NTR నుంచి మనోజ్ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ స్టార్లు ?