Telugu News » Blog » NTR నుంచి మనోజ్‌ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్‌ స్టార్లు ?

NTR నుంచి మనోజ్‌ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్‌ స్టార్లు ?

by Bunty
Ads

సినిమా వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకోవడం ఎంత సహజమో…. రెండు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా అంతే సహజం. అయితే బాలీవుడ్ లో ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తుంటాయి. అదేవిధంగా మన టాలీవుడ్ లోనూ కొంతమంది హీరోలు రెండో వివాహం చేసుకున్నారు. అలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

READ ALSO : Iratta Movie : దుమ్ము లేపుతున్న “ఇరట్ట” చిత్రం మీరు చూశారా?

Documenting the monumental journey of NTR | Events Movie News - Times of India

నందమూరి తారకరామారావు 20 ఏళ్ళ వయసులో మేనమామ కూతురు బసవతారకంను వివాహం చేసుకున్నారు. 1985లో అనారోగ్యం కారణంగా బసవతారకం మరణించారు. కాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్ 1993లో లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకున్నారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు మొద‌ట‌ సీతా దేవిని వివాహం చేసుకున్నారు. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆతర్వాత కృష్ణంరాజు శ్యామల దేవి ని వివాహం చేసుకున్నారు.

READ ALSO : తరుణ్ – ఆర్తి లవ్ విషయం తెలిసిన తర్వాత వారి పేరెంట్స్ రియాక్షన్ ఇదే..!

KAMALHASAN

విశ్వనటుడు కమల్ హాసన్ ఇద్దరిని పెళ్లాడటం తో పాటు మరొకరితో సహజీవనం కూడా చేశారు. ప్రస్తుతం కమల్ హాసన్ ఎవరితోనూ కలిగి ఉండకపోవడం చెప్పుకోదగ్గ విషయం. కమల్ మొద‌ట‌గా వాణి గణపతి ని వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి తర్వాత సారిక‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ శృతి హాసన్ అక్షర హాసన్ పుట్టారు. ఆ తర్వాత కమల్ గౌతమితో సహజీవనం చేశాడు. ప్రస్తుతం వీరు కలిసి ఉండటం లేదు.

 

నాగార్జున మొద‌ట‌గా దగ్గుబాటి లక్ష్మి ని వివాహం చేసుకున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ తర్వాత నాగ్ అమలను వివాహం చేసుకున్నారు.

Advertisement

సీనియర్ హీరో శరత్ బాబు మొదట నటి రమాప్రభను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. అనంతరం స్నేహలత ను వివాహం చేసుకున్నారు. శరత్ బాబు ఆమెకు కూడా విడాకులు ఇచ్చి మరో జర్నలిస్టు వివాహం చేసుకున్నారు.

ప్రకాష్ రాజ్ మొద‌ట లలితకుమారి ని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా ఆ తర్వాత వీళ్లిద్దరు విడిపోయారు. అనంతరం ప్రకాష్ రాజ్ పోనీ వర్మ ను వివాహం చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ మొదటగా నందినిని వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2005లో రేణుదేశాయ్ ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొంతకాలానికి పవన్ రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి రష్యా నటి అన్నా లేజోనవా ను పెళ్లి చేసుకున్నారు.

ఇక తాజాగా మంచు మనోజ్‌ కూడా రెండో పెళ్లి చేసు కున్నాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మంచు మనోజ్‌.. మార్చి 3వ తేదీన భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు.

 

Advertisement

READ ALSO : Pathaan : ‘పఠాన్’ మూవీ ఓటిటి డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?