Home » స‌మంత జ్ఞాప‌కాల‌ను దూరం చేసుకుంటున్న చైతూ..ఈసారి ఏం చేశాడంటే..?

స‌మంత జ్ఞాప‌కాల‌ను దూరం చేసుకుంటున్న చైతూ..ఈసారి ఏం చేశాడంటే..?

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ ల‌వ్లీ క‌పుల్ స‌మంత నాగ‌చైత‌న్య విడిపోవ‌డం ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసిన సంగ‌తి తెలిసిందే. చూడ్డానికి చ‌క్క‌గా చిల‌కాగోరింక‌ల్లా క‌నిపించే ఈ జంట విడాకుల‌ను ప్ర‌క‌టిస్తూ షాక్ అయ్యేలా చేసింది. ఇక విడాకుల త‌రవాత ఎవరిదారి వాళ్లు చూసుకున్న సంగ‌తి తెలిసిందే. సమంత‌ త‌న సినిమాల‌తో బిజీ అయితే నాగ‌చైత‌న్య కూడా సినిమాలు వెబ్ సిరీస్ ల‌తో ఫుల్ బిజీగా మారిపోయాడు.

ALSO READ : పుష్ఫ 2 షూటింగ్ నుండి అస‌హ‌నంతో వెళ్లిపోయిన ర‌ష్మిక‌..అల్లుఅర్జున్ కార‌ణమంటూ ట్వీట్..!

Advertisement

 

ఇక స‌మంత బాలీవుడ్ లో సినిమా ఆఫ‌ర్ లు రావ‌డంతో మ‌కాం కూడా ముంబై కే మార్చేసింది. ఇదిలా ఉంటే విడాకుల కు ముందు ఇద్ద‌రూ క‌లిసి ఓ ఫ్లాట్ లో ఉండేవారు. హైద‌రాబాద్ లోనే నాగ‌చైత‌న్య‌కు న‌చ్చిన ఓ ఫ్లాట్ లో క‌లిసి ఉండేవారు. అయితే విడాకుల త‌ర‌వాత స‌మంత ఆ ఫ్లాట్ ను ఖాళీ చేయ‌గా చైతూ ఒక్క‌డే కొంత‌కాలం పాటూ ఉన్నాడు.

Advertisement

అయితే ఆ తాజాగా నాగ‌చైత‌న్య ఇల్లు మారిన‌ట్టు టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. స‌మంత జ్ఞాప‌కాల‌కు దూరంగా ఉండేలా కొత్త ఇంటికి మారిన‌ట్టు తెలుస్తోంది. కొంత‌కాలం క్రిత‌మే స‌మంత ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేసి అక్క‌డ త‌న అభిరుచికి త‌గిన‌ట్టుగా ఇల్లు నిర్మించున్న‌ట్టు తెలుస్తోంది. ఆ ఇల్లు కూడా నాగార్జున ఇంటికి ద‌గ్గ‌ర‌లోనే ఉన్న‌ట్టు స‌మాచారం. అంతే కాకుండా రీసెంట్ గానే చైతూ కొత్తఇంట్లో అడుగుపెట్టిన‌ట్టుగా తెలుస్తోంది.

ALSO READ : కానిస్టేబుల్ డ్రైవింగ్ టెస్టులు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..? 

Visitors Are Also Reading