Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » కరువు పని డబ్బులను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా ?

కరువు పని డబ్బులను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా ?

by Anji

Karuvu Pani Amount Checking : దేశంలో పేదల ప్రజల కోసం యూపీఏ ప్రభుత్వం 2005లో MGNREGS 2005 యాక్ట్ తో ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా పనులను చేయడాన్ని కరువు పని  అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఈ పథకం పేదలకు పని కల్పించే భరోసాను ఇస్తుంది.

Karuvu Pani Amount Checking

Karuvu Pani Amount Checking

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 100 పని దినాలు పని కల్పించడం తప్పనిసరి. అదేవిధంగా ఈ పథకం ద్వారా పని చేసే వారికి కనీస వేతనం కూడా చెల్లించాలి. ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారిగా కనీస వేతనాన్ని నిర్ణయిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో 2023కి సంబంధించి రూ.257 రూపాయలను చెల్లించాలి. కానీ కేవలం రూ.240 మాత్రమే చెల్లిస్తుంది. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 

Ad

Manam News

కరువు పని డబ్బులు చెక్ చేసే విధానం :

  • పథకం లబ్ది పొందాల్సిన వ్యక్తి తొలుత అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. 
  • http://nrega.nic.in/Nregahome/MGNREGA-new/Nrega-home.aspx
  • హోమ్ పేజీలోకి వెళ్లి Job Carsds లింక్ పై  క్లిక్ చేయాలి
  • ఆ Job Carsds లోకి వెళ్లిన తరువాత మీ స్వంత రాష్ట్రం, తెలంగాణ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి
  • తెలంగాణ రాష్ట్రం పేజీ ఓపెన్ అయిన తరువాత, అందులో  ఏ సంవత్సరం, ఏ జిల్లా,  ఏ  బ్లాక్, ఏ  పంచాయితీ వివరాలను ఎంటర్ చేసి ప్రొసీడ్ కావాలి
  • మీరు ఎంటర్ చేసిన పంచాయితీలో ఉన్న లబ్దిదారులందరి పేర్లు వస్తాయి. అందులో మీ పేరును Job Card నంబర్ తో సులభంగా సెర్చ్ చేసుకోండి
  • మీ జాబ్ కార్డ్ నంబర్ పై క్లిక్ చేయగానే మీ జాబ్ కార్డ్, పని చేసిన కాలం, ఏ పని చేశారనే దానికి సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. అక్కడే ఓ రెడ్ లింక్ ఉంటుంది. దాని పై క్లిక్ చేయగానే పని తేది, పని చేసిన స్థలం, రోజులు, అమౌంట్ కు సంబంధిచిన పూర్తి వివరాలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. 
Visitors Are Also Reading