Telugu News » Blog » ugadi pacchadi: ఉగాది పచ్చడీ తీసుకోకపోతే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్టే..!

ugadi pacchadi: ఉగాది పచ్చడీ తీసుకోకపోతే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్టే..!

by Anji
Published: Last Updated on
Ads

ugadi pacchadi: సాధారణంగా హిందూ సాంప్రదాయంలో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉగాది పండుగకి ఓ ప్రత్యేకమైన స్థానముంది. ఉగాది అంటే ఉగాది పచ్చడి దీని స్పెషల్. షడ్రుచుల సమ్మెళనం ఇది. పులుపు, తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు ఆరు రుచులు కలిసేది ఉగాది పచ్చడి. మన జీవితంలో ఎదురయ్యే మంచి, చెడులను కష్ట సుఖాలను ఒకేరకంగా ఆహ్వానించాలని ఓ సందేహాన్ని ఉగాది పచ్చడి అందిస్తుంది.  

Advertisement

Ugadi pachadi recipe Telugu ingredients

Also Read :  2023లో ఏం జరుగుతుందో బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు!

ugadi pachadi recipe telugu ingredients

ugadi pachadi recipe telugu ingredients

ఈ పచ్చడి తయారు చేయడానికి చింతపండు, వేపపువ్వు, మామిడికాయలు, మిరపకాయలు, ఉప్పు, బెల్లం వాడుతారు. ఒక్కొక్క రుచికి ఓ అర్థముండడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉగాది పచ్చడి పలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఈ పచ్చడిని తీసుకుంటే పలు రోగాలు కూడా నయమవుతాయని కొంత మంది నమ్మకం. ఉగాది  పండుగ స్పెషల్ పచ్చడి. ముఖ్యంగా ఉగాది పండుగకు ఏ రుచి వల్ల ఏం ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :   కార్తీకేయ‌ను బ్రో అని పిలిచిన అఖిల్…కానీ అత‌డి రిప్లై చూసి మండిప‌డుతున్న అఖిల్ ఫ్యాన్స్..!

Ugadi Pachadi ingredients in Telugu

తీపి: 

Manam News

బెల్లం చాలా తియ్యగా ఉంటుంది. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతి రోజు ఒక బెల్లం ముక్క తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బెల్లం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయట. బెల్లం వల్ల రక్తప్రసరణ కూడా సాఫీగా జరుగుతుంది.  

ఉప్పు: 

Manam News

Advertisement

ఉప్పు మానసిక శారీరక రుగ్మతలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఉప్పు మొద శక్తిని పెంచుతుంది. నాడీ వ్యవస్థ మెదడు పని తీరు బాగుండాలని ఈ కాలంలో డీ హైడ్రేషన్ సమస్య రాకుండా ఉండాలన్నా ఉప్పు తప్పనిసరిగా తీసుకోవాలి. బ్యాక్టీరియాల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. జీర్ణాశయం శరీరం శుభ్రమవుతుంది. చర్మ సమస్యలు దూరమవుతాయి. 

చేదు : 

వేపలో చేదు గుణముంటుంది. రోగ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రుతువులలో వచ్చే మార్పుల కారణంగా పిల్లలకు సోకే కలరా, మలేరియా, ఆటలమ్మ, నిరోధకంగా ఉపయోగపడుతుంది. గుమ్మానికి వేపాకులు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి వస్తుంది. వేపాకు రక్తాన్ని శుద్ధి చేసే లక్షణం దీనిలో ఉంది. శరీరంలో రోగ నిరోధకశక్తి మెరుగుపరుస్తుంది. 

వగరు :

Manam News

మామిడికాయలో పులుపు, తీపితో పాటు వగరు గుణం కూడా ఉంటుంది. చర్మం నిగారింపు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. విపరీతమైన చలి తరువాత వేడి వల్ల పెదాలు పగలడాన్ని మామిడిపండులోని వగరు గుణం తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. 

కారం :

Manam News

పచ్చిమిర్చిలో కారం గుణం తలనొప్పి కండరాలు నరాల నొప్పులను తగ్గిస్తుంది. అజీర్తి సమస్యలు తగ్గుతాయి. ముఖంపై మొటిమలు తగ్గించేందుకు యాంటీబయాటిక్ గా పని చేయడమే కాకుండా అధిక వేడికి చక్కని ఔషదంలా పనిచేస్తుంది. 

పులుపు : 

Manam News

చింతపులుసు, మామిడి ముక్కలు కలిసి మన ఆలోచన శక్తి పరిధిని మరింతగా పెంచుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. చింతపండులోని పులుపు వేసవిలో వేడి నుంచి ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడుతుంది. చింతపండు మనలోని చింతను దూరం చేసి మానసిక ఆరోగ్యం బారిన పడకుండా రక్షిస్తుంది. 

Advertisement

Also Read :   మీరు అతిగా నిద్ర పోతున్నారా.. అయితే ఈ ప్రమాదంలో పడినట్టే ?