Home » కుప్ప కూలిన రష్యా విమానం.. 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు దుర్మరణం..!

కుప్ప కూలిన రష్యా విమానం.. 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు దుర్మరణం..!

by Anji
Ad

రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యాకు చెందిన విమానం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు మృతి చెందారు. యుద్ధ ఖైదీలు, ఆరుగు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న రష్యా సైనిక విమానం ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరోడ్‌ ప్రాంతంలో బుధవారం కుప్పకూలిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

Advertisement

ఉదయం 11 గంటల సమయంలో ఈ విమానం కుప్పకూలిందని పేర్కొంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొంది. ఘటనలో ఎవరైనా బ్రతికి బయటపడ్డారా? అని కూడా తెలియలేదని చెప్పింది. అయితే, అధికారులు విమానం కూలిపోవడానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. ప్రత్యేక సైనిక మిషన్‌ విమానం కూలిన ప్రాంతానికి బయలుదేరిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Visitors Are Also Reading