Home » యుద్ధ ట్యాంక్ పై ఉత్తర కొరియా అధ్యక్షుడు!

యుద్ధ ట్యాంక్ పై ఉత్తర కొరియా అధ్యక్షుడు!

by Anji
Ad

కిమ్ జోెంగ్ ఉన్  అనే పేరు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది.  చదువుకున్న ప్రతీ ఒక్కరూ ఇతని గురించి నిత్యం వార్తల్లో ఏదో ఒక విషయాన్ని చదువుతూనే ఉంటారు.   నిరంతరం ఏదో ఒక వార్తలో నిలిచే కిమ్ ఉత్తర కొరియాలోని సైనిక శిక్షణా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన యుద్ధ ట్యాంకర్ ను నడిపి తాజాగా మరోసారి వార్తలో నిలిచారు.

Advertisement

Advertisement

ఉత్తర కొరియా లో సైనిక దళాల కోసం రూపొందించిన యుద్ధ ట్యాంకర్ ను వీక్షించేందకు స్వయంగా కిమ్ యుద్ధ ట్యాంకర్ ను నడిపారు. దీనిని ప్రపంచంలో నే అత్యంత శక్తి వంతమైన యుద్ధ ట్యాంకర్ గా కిమ్ తెలిపారని, ఆ దేశ అధికార మీడియా సంస్థ చెప్పినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మరొవైపు అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాలు గురువారం తో ముగియనున్నాయి. దీనికి ప్రతి స్పందనగా కిమ్ సైనిక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. 2022 ఆరంభం నుంచి ఉత్తర కొరియా నిరంతరం క్షిపణులను,అత్యాధునిక తుపాకులను వివిధ రకాల ఆయుధాలను పరీక్షిస్తుంది. భారీ యుద్ధ ట్యాంకర్లతో చేసిన విన్యాసాలు ఉత్తర కొరియా సైనిక దళం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా శత్రువులను ఎదుర్కొవటానికి సిద్ధమైందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

Also Read :  Balayya : బాలయ్య సినిమాను రీమేక్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్..!

Visitors Are Also Reading