Home » ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వ‌చ్చిన యాంక‌ర్ నే పెళ్లి చేసుకున్న హీరో…కానీ జీవితంలో ఇన్ని క‌ష్టాలు ఉన్నాయా..?

ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వ‌చ్చిన యాంక‌ర్ నే పెళ్లి చేసుకున్న హీరో…కానీ జీవితంలో ఇన్ని క‌ష్టాలు ఉన్నాయా..?

by Bunty
Ad

 

తమిళ్ హీరో విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విజయ్ తమిళంలో కూడా సినిమాలు చేసేవారు. ఇక విజయ్ తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడట. అతి చిన్న వయసు నుంచే చాలా కష్టాలు పడి ఎదిగాడట. చిన్నతనంలోనే తన తండ్రి చనిపోయేసరికి కుటుంబ బాధ్యతలని విజయ్ చూసుకునేవాడట.

Advertisement

తన తండ్రి చనిపోయిన సమయంలో విజయ్ వయసు ఏడు సంవత్సరాలు. తన చెల్లికి నాలుగు సంవత్సరాలు. ఇక తన తల్లి ఉద్యోగం చేస్తూ వారిని చదివించి పెద్దది చేసిందట. తన తల్లి ఉద్యోగరీత్యా ట్రైనింగ్ క్లాస్ లకు వెళ్లాల్సి వచ్చేదట. ఇక ఆ సమయంలో విజయ్ ని హాస్టల్ లో చేర్పించి, తన కూతుర్ని తన వెంట తీసుకెళ్లలేదట. అయితే అనుకోకుండా విజయ్ హాస్టల్లో ఉన్న సమయంలో రెండు రోజులు హాస్టల్ కి సెలవు ఇచ్చారట. ఆ సమయంలో విజయ్ ఎక్కడ ఉండాలో అర్థం కాక తన వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణాదుల శిబిరంలో ఉండేవాడట. ఆ సమయంలో తన వద్ద ఒక్క రూపాయి కూడా ఉండేది కాదట. అలాంటి సమయంలో విజయ్ కేవలం ఒకే ఒక్క అరటిపండు తిని తన రోజుని కొనసాగించారట.

Advertisement

ఇక తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించిన విజయ్ సినిమాల పైన ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా, ఎడిటర్గా, నిర్మాతగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యాడు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే విజయ్… ఫాతిమా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తన వివాహం ఓ సంచలనం సృష్టించింది. ఫాతిమా అనే జర్నలిస్ట్ విజయ్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. మొదటి చూపులోనే తనతో ప్రేమలో పడిన విజయ్ తనను పెళ్లి చేసుకోమని అడిగాడట. దీంతో వీరిద్దరూ 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఇక విజయ్ స్టార్ హీరోగా కొనసాగుతూ…తన కుటుంబంతో సంతోషంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 

Vishal : స్టార్ హీరోతో లక్ష్మీ మీనన్ పెళ్లి…!

Nayanatara : నయనతార మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

విజయ్ తొడలపైన సమంత…నాగచైతన్య ఫ్యాన్స్ ఆగ్రహం !

Visitors Are Also Reading