Home » Vishal : స్టార్ హీరోతో లక్ష్మీ మీనన్ పెళ్లి…!

Vishal : స్టార్ హీరోతో లక్ష్మీ మీనన్ పెళ్లి…!

by Bunty
Ad

 

తమిళ నటి లక్ష్మీ మీనన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలు అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొలీవుడ్ లో ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన కుంకి చిత్రంతో లక్ష్మీ మీనన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళంలో వరసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది. ఇక విజయ్ సేతుపతి సరసన రెక్కయి చిత్రంలో హీరోయిన్గా నటించి తమిళ ప్రేక్షకులను అలరించింది.

Advertisement

ఆ తర్వాత వేదాళం సినిమాలో అజిత్ కు చెల్లెలుగా నటించింది. ఆ సినిమా అనంతరం తనకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. చాలా రోజుల తర్వాత లక్ష్మి మీనన్ చంద్రముఖి 2 సినిమాలో నటిస్తోంది. అయితే ఈ అమ్మడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. ఒక స్టార్ హీరో ను పెళ్లి చేసుకోబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. స్టార్ హీరో విశాల్ తో ఈ అమ్మడు పెళ్లి జరుగుతుందని సమాచారం.

Advertisement

వీరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉందని టాక్ నడుస్తోంది. ఈ అమ్మడు వయసు ప్రస్తుతం 29 సంవత్సరాలు. విశాల్ వయసు చాలా ఎక్కువగా ఉండటంతో వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉందని పలువురు ప్రముఖులు అంటున్నారు. అంతేకాకుండా ఈ మధ్య విశాల్ అభినయని వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఇక విశాల్ ఎవరిని వివాహం చేసుకుంటాడనే విషయాన్ని ఎవరో ఒకరు చెబితే కానీ తెలుసుకోవడం కష్టంగా మారింది. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చలు నడుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

Nayanatara : నయనతార మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

విజయ్ తొడలపైన సమంత…నాగచైతన్య ఫ్యాన్స్ ఆగ్రహం !

సుమంత్ కీర్తి రెడ్డికి విడాకులు ఇవ్వడం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?

Visitors Are Also Reading