Home » విజయ్ దళపతి హీరోగా తెలుగులో మరో సినిమా ?

విజయ్ దళపతి హీరోగా తెలుగులో మరో సినిమా ?

by Anji
Ad

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సినీ ఇండస్ట్రీలో తమిళ హీరోలు తెలుగు దర్శకులతో.. తెలుగు హీరోలు తమిళ, హిందీ దర్శకులతో సినిమాలు చేయడం అనేది ఇప్పుడు ట్రెండ్ అయింది. ముఖ్యంగా మన తెలుగు దర్శకులు తమిళ హీరోలకు మంచి హిట్స్ ని అందిస్తున్నారు. తమిళ దర్శకులు మాత్రం ఇంకా హిట్ ఇచ్చే పనిలోనే ఉన్నారు. ఈ లిస్టులో తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరో దళపతి విజయ్ తో  తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.   

Also Read :   విరూపాక్షలో ఈ అఘోరా పాత్ర హైలెట్ అవుతుందా…?

Advertisement

విజయ్ సినీ కెరీర్ లోనే ఆల్ టైం అత్యధిక వసూళ్లను అందించాడు వంశీ పైడిపల్లి. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన  వారసుడు చిత్రం సంక్రాంతి పండుగకు విడుదలై సూపర్ హిట్ సాధించింది. విజయ్ తర్వాత మరొక తెలుగు దర్శకుడికి ఛాన్స్ ఇస్తారని రూమర్స్ వినిపించాయి. కానీ ప్రస్తుతం ఆ రూమర్స్ వాస్తవం అయినట్టు కనిపిస్తోంది. తెలుగులో వీరసింహారెడ్డి, క్రాక్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని విజయ్ ని ఒప్పించాడట. దళపతి విజయ్ కి గోపీచంద్ స్క్రిప్టు వినిపించారట.కానీ విజయ్ మాత్రం  చెప్పలేదని తెలుస్తోంది.  మరోవైపు ఈ సినిమాను కూడా వీరసింహారెడ్డి నిర్మించిన  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండడం విశేషం. 

Advertisement

Also Read : సీక్రెట్ మ్యారేజ్ గురించి ఆ బాలీవుడ్ బ్యూటీ ఏమందో తెలుసా ?

ఇక ఇప్పటికే విజయ్ కి మైత్రి మూవీ మేకర్స్ వారు అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్టు సమాచారం. కానీ గోపీచంద్ ఫుల్ స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసి మరోసారి విజయ్ కి మ్యారేజ్ చేసి ఓపెన్ చేస్తే సరిపోతుందని తెలుస్తోంది. విజయ్ మరొక తెలుగు బ్యానర్ లో తెలుగు దర్శకుడు తో సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పుకోవాలి. ఈ సినిమాను కూడా విజయ్ హిట్ కొట్టి రికార్డు సృష్టిస్తాడో లేదో వేచి చూడాలి. 

Also Read :  చిరంజీవి కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారా..?

Visitors Are Also Reading