Home » విరూపాక్షలో ఈ అఘోరా పాత్ర హైలెట్ అవుతుందా…?

విరూపాక్షలో ఈ అఘోరా పాత్ర హైలెట్ అవుతుందా…?

by Bunty
Ad

మెగా హీరో సాయి తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం విరూపాక్ష. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం ఇదే. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది.

READ ALSO : విరాట్ అంకుల్… వమికాను డేట్ కు తీసుకెళ్లొచ్చా… బుడ్డోడి ప్లకార్డు వైరల్

Advertisement

బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. సినిమా కథ ఏంటన్న దానిపై అందరిలో క్యూరియాసిటీ పెంచేసింది మూవీ. ఈ చిత్రం ట్రైలర్ లో అఘోరాగా అజయ్ విజువల్స్, స్టన్నింగ్ కనిపిస్తున్నాయి. విరూపాక్షలో అజయ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. నెట్టింట అజయ్ అఘోరా లుక్ కు సంబంధించిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.

Advertisement

READ ALSO : IPL 2023 : గాయమైనా.. జట్టు కోసం పోరాడిన RCB కెప్టెన్

Sai Dharam Tej Extends 'Maha Shivaratri' Wishes Along With Sharing A New Poster Of 'Virupaksha'

అన్ని అనుకున్నట్టుగా కుదిరితే విరూపాక్ష సినిమా అజయ్ కెరీర్ లో ముఖ్యమైన సినిమాగా నిలిచిపోనున్నదనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ జనాలు. ఎన్నో సినిమాల్లో హీరో ఫ్రెండ్ గానూ, విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వచ్చిన అజయ్ తనకు ఇచ్చిన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ వస్తున్నారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన కొన్ని సినిమాల్లో తనకు ఇచ్చిన పాత్రకు పర్ఫెక్ట్ న్యాయం చేశాడు. రాబోతున్న విరూపాక్ష సినిమాలో కూడా అజయ్ తన నటనతో మెప్పించాడని తెలుస్తుంది.

READ ALSO :  Ileana :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా….

Visitors Are Also Reading