Home » సీక్రెట్ మ్యారేజ్ గురించి ఆ బాలీవుడ్ బ్యూటీ ఏమందో తెలుసా ?

సీక్రెట్ మ్యారేజ్ గురించి ఆ బాలీవుడ్ బ్యూటీ ఏమందో తెలుసా ?

by Anji
Ad

రెండు దశాబ్దాలుగా హిందీ, పంజాబీ సినిమాలతో అలరిస్తోంది మహి గిల్. ఇప్పటివరకు పెళ్లి విషయంపై పెదవి విప్పని మహీ తనకు రెండేళ్ల పాప ఉందనే విషయాన్ని 2019లోనే చెప్పింది. అయితే ఎంటర్ పెన్యూర్, యాక్టర్ రవి కేశర్ తో ఆమె లివ్ ఇన్ రిలేషన్ లో ఉందనే వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఇంతవరకు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించని ఈ 47 పంజాబీ భామ ఇప్పుడు హఠాత్ముగా తామిద్దరికీ గతంలో పెళ్లి అయిపోయిందనే విషయాన్ని స్పష్టం చేసింది.  

Also Read :  తెలంగాణ వారిపై పవన్ కళ్యాణ్ ఈగ వాలనివ్వడం లేదు : పేర్ని నాని

Advertisement

Advertisement

రవితో కలిసి 2019లో మహి గిల్ ఫిక్సర్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. వాస్తవానికి అప్పటికే ఆమెకు ఓకూతురు కలదు. ఇప్పుడు కూడా రవిని ఎప్పుడూ పెళ్లి చేసుకుందనే విషయాన్ని మాత్రం మహీగిల్ తెలియపరచలేదు. అత్యంత సన్నిహితుల సమక్షంలో తమ పెళ్లి జరిగిందని చెప్పింది. ప్రస్తుతం కూతురు విరోనికా, రవి కేసర్ తో కలిసి మహి గిల్ గోవాలో నివాసముంటోంది. దేవ్ డి, నాట్ ఎ లవ్ స్టోరీ, సాహెబ్ బీవీ అవుర్ గ్యాంగ్ స్టర్, పాన్ సింగ్ తోమర్ తదితర చిత్రాలతో పాటు రామ్ చరణ్ ఏకైక హిందీ చిత్రం జంజీర్ లోనూ మహి గిల్ నటించింది. 

తెలుగులో తుఫాన్ పేరుతో వచ్చింది. గతంలో తన కుమార్తె వెరోనికా గురించి చెబుతూ.. నేను ఓ పాపకు తల్లినని చెప్పుకోవడానికి గర్వపడతాను. ఇప్పటివరకు పెళ్లి కాలేదు. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పుడే చేసుకుంటాను” అని తెలిపింది. మొత్తానికి ఆ ముచ్చట ఏదో తీరిపోయిందని ఇప్పటికైనా ప్రపంచానికి మహి గిల్ చెప్పడం గమనార్హం.  

Also Read :  ఇంతకీ వైఎస్ భాస్కర్ రెడ్డి ఎవరు? జగన్ భార్య భారతికి ఏమవుతారు?

Visitors Are Also Reading