Home » ఎముకలు బలంగా ఉండాలా? అయితే ఈ ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాలి.. అవేంటంటే?

ఎముకలు బలంగా ఉండాలా? అయితే ఈ ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాలి.. అవేంటంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ప్రస్తుతం తీసుకుంటున్న ఆహరంలో క్వాలిటీ చాలా తక్కువగా ఉంటోంది. పంటలు పండడమే ఎరువుల సహాయంతో పండిస్తున్నారు. దీనితో మనం తీసుకునే ఆహారంలో పోషకాల సంగతి ప్రస్నార్ధకమే అవుతోంది. ఇది ఒకెత్తు అయితే.. మరొక ఎత్తు మన లైఫ్ స్టయిల్ . ఆహరం తీసుకునే వేళ దాటిపోతూ ఉంటోంది. మరో వైపు ఉద్యోగరీత్యా చాలా మంది ఎక్కువ సేపు లాప్టాప్ ముందు కూర్చునే ఉంటున్నారు. పోషకాహారం కంటే ఎక్కువగా జంక్ ఫుడ్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని వలన శరీరంలో సత్తువ కూడా తగ్గిపోతోంది.

Advertisement

శరీరానికి సరైన పోషకాలు అందకపోవడం వలన రకరకాల రోగాలు వస్తున్నాయి. ఎముకలకు సంబంధించిన రోగాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అయితే ఆహరం తీసుకునే విషయంలో కొన్ని చిట్కాలను పాటించడం వలన ఈ సమస్యను ఎదుర్కొనవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే రాగిజావ తీసుకోవడం అలవాటుగా చేసుకోండి. దీనివలన అనేక సమస్యలు దరికి రాకుండా ఉండడమే కాదు ఎముకలు కూడా ధృడంగా ఉంటాయి.

Advertisement

రాగిజావలో పాలు కలిపి తీసుకుంటే శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది. అధిక బరువు ఉన్నవారు ఉదయం అల్పాహారంగా రాగి జావ తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. అలాగే తల్లిపాలు రాకుండా ఇబ్బంది పడుతున్న బాలింతలు ఉదయాన్నే రాగి జావ తీసుకుంటే పాలు ఎక్కువగా పడి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 250 మిల్లీలీటర్ల పాలు స్టవ్ పై కాచి ఆ గిన్నె లోనే రెండు చెంచాల రాగి పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. రాగి పిండి ఉడికినట్లు అనిపించాక అందులో యాలకుల పొడి వేయాలి. తరువాత స్టవ్ ఆపేసి బెల్లం కలుపుకోవాలి. రాగి జావ సిద్ధం అయిపోయినట్లే. దీనిని ఉదయాన్నే తీసుకోవడం వలన శరీరానికి పోషకాలు లభించి ఎముకలు ధృడంగా ఉంటాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

హీరో సూర్య చిల్ట్రన్స్ ఎక్కడ చదువుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

 హీరో ప్రశాంత్ సినిమా కెరీర్ నాశనం కావటానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading