Home » తన షాట్స్ సీక్రెట్ ఏంటో చెప్పిన సూర్య..!

తన షాట్స్ సీక్రెట్ ఏంటో చెప్పిన సూర్య..!

by Azhar
Ad

భారత జట్టులో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్. ఇప్పుడు భారత జట్టుకు టీ20ల్లో ముఖ్యమైన ఆటగాడిగా ఉన్న సూర్య.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే ఆసీస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో కూడా సూర్య అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో మూడు అర్ధ శతకాలు అనేవి బాదిన సూర్య కుమార్ యాదవ్.. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో ఉన్నాడు.

Advertisement

అయితే చివరగా ఇండియా, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ చేసిన బ్యాటింగ్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు అనే చెప్పాలి. ఈ మ్యాచ్ ముందు వరకు కూడా 360 డిగ్రీస్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నా సూర్య.. ఈ మ్యాచ్ లో తన కొత్త కొత్త షాట్స్ తో అందరిని తన ఫ్యాన్స్ గా మార్చుకున్నాడు.

Advertisement

అయితే తాజాగా అశ్విన్ తో చిట్ చాట్ చేసిన సూర్య కుమార్ యాదవ్.. తన షాట్స్ సీక్రెట్ అనేది బయటపెట్టాడు. సూర్య మాట్లాడుతూ.. నేను చిన్నపూడి రబ్బర్ బంతితో ఆడేవాడిని. అక్కడ నా ఫ్రెండ్ బౌలింగ్ చేస్తున్న సమయంలోనే ఈ షాట్స్ ఆడటం అనేది నేర్చుకున్నాను. అంతే కానీ 360 డిగ్రీస్ లో ఆడాలి అని నేను నెట్స్ లో ఏం ప్రాక్టీస్ చేయను అని సూర్య కుమార్ యాదవ్ పేర్కొనాడు.

ఇవి కూడా చదవండి :

వచ్చే ప్రపంచ కప్ ఆడే దేశాలు ఇవే..!

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ సూర్యనే..!

Visitors Are Also Reading