Home » ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్ లో ఎవరంటే..?

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్ లో ఎవరంటే..?

by Azhar
Ad
ఈ ఏడాది ప్రారంభంలోనే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ బ్యాటర్లదే హావ అనేది ఉందేది. కానీ సూర్య కుమార్ యాదవ్ వచ్చి వారికీ బ్రేకులు వేసాడు అనేది అందరికి తెలిసిందే. టాప్ లో కొనసాగుతున్న వారిని కిందరు నెట్టేశాడు. అయితే ఆసియా కప్ తో పటు దాని ముందు వెనుక.. స్థిరమైన ప్రదర్శన అనేది ఇవ్వడంతో.. సూర్య ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానానికి కూడా చేరుకున్నాడు.
కానీ ఆ తర్వాత మళ్ళీ ఆ స్థానానికి పాకిస్థాన్ బ్యాటర్ మొహ్మద్ రిజ్వాన్ వచ్చేసాడు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఐసీసీ తమ టీ20 ర్యాంకింగ్స్ అనేవి ప్రకటించింది. ఇక ఇందులో కూడా టాప్ లో రిజ్వాన్ 861 పాయింట్లతో కొనసాగుతున్నాడు. ఇక సూర్య 838తో రెండో స్థానంలో ఉంటె.. బాబర్ ఆజాం 808తో మూడో స్థానంలో ఉన్నాడు. సూర్య మినహా టాప్ 10 లో మరో భారత బ్యాటర్ అయితే లేరు.
కానీ కేఎల్ రాహుల్ 13వ స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 15, రోహిత్ శర్మ 16వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక బౌలింగ్ లో అయితే టాప్ 10 లో ఒక్క భారత బౌలర్ కూడా లేరు. అయితే అందరికంటే మెరుగ్గా భువనేశ్వర్ కుమార్ 638 పాయింట్లతో 12 వ స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్ రౌండర్ లలో హార్దిక్ పాండ్య 173 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

Visitors Are Also Reading