Telugu News » Blog » ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు వరుణుడు హాజరు..?

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు వరుణుడు హాజరు..?

by Manohar Reddy Mano
Ads

ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ అనేది ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లు జరుగుతుండగా.. ఇప్పటికే క్వాలిఫై అయిన జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతున్నాయి. అయితే మన ఇండియా జట్టు అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి.. రెండు వరాల ముందే అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ అనేది ప్రారంభించింది.

Advertisement

అయితే ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ ఇండియా ఈ నెల 23న దాయాధి పాకిస్థాన్ తో ఆడనుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే మొత్తం ప్రపంచం దృష్టి అటువైపే ఉంటుంది అనేది తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ కు ఫ్యాన్స్ తో పాటుగా వరుణుడు కూడా జహారు అవుతాడు అని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. ఈ మ్యాచ్ జరగాల్సిన మెల్బోర్న్ అలాగే బ్రిస్బేన్ లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వారు చెప్పారు.

Advertisement

ఇప్పటికే అక్కడ ప్రారంభమైన వర్షాల కారణంగా ఈరోజు జరగాల్సిన ఇండియా న్యూజిలాండ్ వర్మంప్ మ్యాచ్ కూడా రద్దు అయ్యింది. ఇక 23న ఇండియా, పాక్ మ్యాచ్ సమయంలో కూడా మెల్బోర్న్ లో వర్షం పడే అవకాశం అనేది 90 శాతం ఉన్నట్లుగా.. కనీసం 25 నుండి 30 మిల్లి మీటర్ల వర్షం పడే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. ఇకవేళ ఈ మ్యాచ్ రోజు వర్షం వస్తే మాత్రం ఫ్యాన్స్ ఆశలు అన్ని నిరాశలే.

Advertisement

ఇవి కూడా చదవండి :

ఇండియా పాకిస్థాన్ రాకపోతే అదే జరుగుతుంది..!

పాకిస్థాన్ పై గెలిస్తే ప్రపంచ కప్ గెలిచినట్టే..!

You may also like