Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » వరల్డ్ కప్ ముందు… జల్సాల కోసం సెలవులు అవసరమా రోహిత్ : గవాస్కర్ సీరియస్

వరల్డ్ కప్ ముందు… జల్సాల కోసం సెలవులు అవసరమా రోహిత్ : గవాస్కర్ సీరియస్

by Bunty
Ads

భారత పర్యటనను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-2తో కోల్పోయిన ఆస్ట్రేలియా 3 వన్డేల సిరీస్ ను మాత్రం 2-1తో కైవసం చేసుకుంది. చెన్నై వేదికగా బుధవారం జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. అయితే.. ఈ తరుణంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. కుటుంబ బాధ్యతల కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలివన్డేకు రోహిత్ దూరం అయ్యాడు.

Advertisement

READ ALSO : NTR 30 : అప్పుడు తాత.. ఇప్పుడు మనవడు.. అస్సలు తగ్గట్లేదుగా…!

Ad

Advertisement

దీంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో టీమ్ఇండియా తొలి మ్యాచ్ ఆడి విజయం సాధించిన విషయం తెలిసింది. వన్డే ప్రపంచ కప్ ముంగిట కుటుంబ బాధ్యతల పేరుతో రోహిత్ మ్యాచ్ కు దూరంగా ఉండడం సరికాదని గవస్కర్ అన్నాడు. నాయకత్వంలో కొనసాగింపు ఉండాలన్నాడు. “రోహిత్ శర్మ టీం ఇండియా సారథి. అతడు కచ్చితంగా అన్ని మ్యాచ్లు ఆడాలి. కుటుంబ బాధ్యతలు వల్ల అతడు అక్కడ ఉండాల్సి వచ్చిందని నాకు తెలుసు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ కేవలం ఒక్క మ్యాచ్ కోసం జట్టు కెప్టెన్ గా వ్యవహరించేవారు ఎక్కడ ఉండరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఏ ఇతర ఆటగాడికైనా జరగొచ్చు. నాయకత్వంలో కొనసాగింపు ఉండాలి. అది జట్టుకు చాలా అవసరం. అప్పుడే అందరూ నీతో ఉన్నారు అన్న భావన నీకు కలుగుతుంది.

READ ALSO : సమాధిపై QR కోడ్… కొడుకు జ్ఞాపకాలు చెదిరిపోకుండా తండ్రి ఆలోచన!

అప్పుడే జట్టును సమర్ధంగా ముందుకు నడిపించవచ్చు. లేదంటే ఒక జట్టుకు ఇద్దరు నాయకులు ఉంటారు. జట్టు సభ్యులు ఇద్దరు నాయకుల కోసం ఎదురు చూస్తారు. అది జట్టుకు ఎంత మాత్రం మంచిది కాదు. వన్డే ప్రపంచ కప్ ప్రారంభమైతే మీరు కుటుంబ బాధ్యతలు నిర్వహించలేరు. అత్యవసర పరిస్థితిలో మినహా మిగతా ఏ పనులు ఉన్నా టోర్నమెంట్ కు ముందే పూర్తి చేసుకోండి” అని గావస్కర్ సూచించాడు.

READ ALSO : పవిత్ర-నరేష్ హనీమూన్… వెలుగులోకి షాకింగ్ నిజాలు…!

Visitors Are Also Reading