Home » సమాధిపై QR కోడ్… కొడుకు జ్ఞాపకాలు చెదిరిపోకుండా తండ్రి ఆలోచన!

సమాధిపై QR కోడ్… కొడుకు జ్ఞాపకాలు చెదిరిపోకుండా తండ్రి ఆలోచన!

by Bunty

సెంట్రల్ కేరళలోని త్రిస్సుర్ జిల్లా కురియాచీరా పట్టణానికి చెందిన సెయింట్ జోసెఫ్ చర్చికి వెళ్లిన వారెవరైనా అక్కడ ఓ సమాధిని చూసి కాసేపు అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఆ సమాధి పలకపై పెద్ద సైజులో ఉన్న ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని చూసి చాలామంది అక్కడే ఆగి విస్తుపోతున్నారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూసిన తర్వాత ఆశ్చర్యపోతున్నారు. అందులో ఉన్న వివరాలు చూసి ఎమోషనల్ అవుతున్నారు.

READ ALSO : పడిపోయిన కోహ్లీ వాల్యూ…టాప్ ప్లేస్ లో చరణ్!

26 ఏళ్ల వయసులో అకాల మరణానికి గురైన యువ వైద్యుడు ఐవిన్ ఫ్రాన్సిస్ సమాధి అది. ఈ కోడ్ ను స్కాన్ చేస్తే డాక్టర్ ఐవిన్ జీవిత విశేషాలు, అతడి సృజనాత్మక ప్రతిభ తాలూకు వీడియోలు చూడవచ్చు. వైద్యుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న కుమారుడు చిన్న వయసులోనే తమకు దూరం కావడంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు ఐవిన్ జ్ఞాపకాలు సజీవంగా ఉండాలన్న తలంపుతో ఈ ఏర్పాటు చేశారు.

READ ALSO : అవకాశం కోసం పక్కలోకి రమ్మన్నారు – శ్రీముఖి

డాక్టర్ ఐవిన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ఓ వెబ్ పేజీ రూపొందించిన అతడి కుటుంబం క్యూఆర్ కోడ్ తో దాన్ని అనుసంధానం చేసింది. ఈ కోడ్ ను స్కాన్ చేస్తే ఐవిన్ చిత్రాలు, కళాశాలలో కీబోర్డు, గిటార్లతో ఇచ్చిన ప్రదర్శనలు, మిత్రుల వివరాలు అన్నీ చూడవచ్చు. 2021లో బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిపోయిన డాక్టర్ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు.

READ ALSO : 2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్… హైదరాబాదులో ఆ మ్యాచులు!

Visitors Are Also Reading