Telugu News » Blog » NTR 30 : అప్పుడు తాత.. ఇప్పుడు మనవడు.. అస్సలు తగ్గట్లేదుగా…!

NTR 30 : అప్పుడు తాత.. ఇప్పుడు మనవడు.. అస్సలు తగ్గట్లేదుగా…!

by Bunty

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కొత్త ప్రాజెక్టు ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాజమౌళి, ప్రశాంత్, ప్రకాష్ రాజ్, జాన్వీ కపూర్ తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి వచ్చిన జాన్వీ కపూర్ ని చూసి ఎన్టీఆర్ షాక్ అయ్యాడు.

READ ALSO : సమాధిపై QR కోడ్… కొడుకు జ్ఞాపకాలు చెదిరిపోకుండా తండ్రి ఆలోచన!

స్టేజ్ పైనే డైరెక్టర్ కొరటాల శివ పక్కనే ఉన్న కూడా జాన్విని చూసి ఆయన ఆశ్చర్యపోయి వెంటనే ఆమె వద్దకు వచ్చి పలకరించాడు. ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చాడు. జాన్విని చూడగానే ఎన్టీఆర్ ఇచ్చిన రియాక్షన్ కెమెరాలో క్లిక్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన చాలా మంది ఏంటి తారక్, జాన్వి తెగ నచ్చేసిందా, అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

READ ALSO : పవిత్ర-నరేష్ హనీమూన్… వెలుగులోకి షాకింగ్ నిజాలు…!

ntr jr: NTR 30: NTR Jr, Janhvi Kapoor kick off their new film 'NTR 30' with a grand opening ceremony - The Economic Times

గతంలో నందమూరి తారక రామారావు గారు శ్రీదేవి ఎలాంటి స్క్రీన్ టైం ఇచ్చారో, అదేవిధంగా ఉంది ఈ జంట అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈ జంట తెరపై కనిపిస్తే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అంటూ ఫిక్స్ అయిపోయారు. ఇకపోతే ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంస్థపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ రవిచంద్రన్ అందిస్తున్నారు.

READ ALSO : 2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్… హైదరాబాదులో ఆ మ్యాచులు!

You may also like