Home » ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన శ్రీలంక..!

ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన శ్రీలంక..!

by Azhar
Published: Last Updated on
Ad

ప్రస్తుతం శ్రీలంకలో ఆర్ధిక పరిస్థితులు కొంచెం మెరుగుపడుతున్నాయి అనేది తెలిసిందే. కానీ ఇంకా కష్టాలు మొత్తం తీరిపోలేదు. ఈ కష్టాల మధ్యనే శ్రీలంక పర్యాటకు వచ్చింది ఆస్ట్రేలియా. ఇందులో భాగంగా మొదటి టీ20 లో తలపడ్డాయి ఈ రెండు జట్లు. అయితే మొదటి రెండు మ్యాచ్ లలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్ జట్టు లంకను లంకలోనే వైట్ వైస్ చేయాలనీ అనుకుంది. మూడో టీ20 మ్యాచ్ చూస్తే లంక కూడా వైట్ వైస్ అయినట్లే అనుకున్నారు అంత. కానీ ఎవరు ఊహించని విధంగా లంక విజయం సాధించడమే కాదు… ఏకంగా ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది.

Advertisement

అయితే లంక విజయానికి ఆఖరి మూడు ఓవర్లలో 59 పరుగులు కావాలి. అంటే దాదాపుగా ఓవర్ కు 20 పరుగులు. దాంతో లంకె విజయం అసాధ్యం అనుకున్నారు అందరూ. కానీ అప్పుడే శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తన బ్యాట్ ను ఝుళిపించాడు. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్ లో లంకకు 19పరుగులు కావాల్సి ఉండగా.. కెప్టెన్ 2 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి ఒక బంతి మిగిలి ఉండగానే స్కోర్లు సమం చేశాడు. ఆ తర్వాత బౌలర్ వైడ్ బాల్ వేయడంతో శ్రీలంక గెలుపొందింది. 6 వికెట్లు కోల్పోయి కష్టాలో ఉన్న లంకను కెప్టెన్ షనక 25 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 54పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచి 4వికెట్ల తేడాతో జట్టుకు విజయాన్ని అందించాడు.

Advertisement

ఇక ఈ క్రమంలోనే లంక ఓ ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది. అదేంటంటే ఇన్నింగ్స్ ఆఖరి 3 ఓవర్ లలో ఇప్పటివరకు ఎవరు ఇన్ని పరుగులు చేయలేదు. దాంతో ఆఖరి మూడు ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా లంక నిలిచింది. అంతే కాకుండా ఆర్ధిక కష్టాలతో ఉన్న తా దేశ ప్రజలకు ఓ చిన్నఆనందం ఇవ్వడమే కాకుండా… స్వదేశంలో వైట్ వాష్ కాకుండా బతికిపోయింది లంక. అయితే ఈ మ్యాచ్ లో వీరవిహారం చేసిన లంక కెప్టెన్ షనక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి :

మిథాలీ ఆ క్రికెటర్ పై ప్రేమతోనే పెళ్లి చేసుకోలేదా..?

Visitors Are Also Reading