Home » NBK 108 : బాలయ్య సినిమాలో శ్రీ లీల..ఏకంగా ఆ పాత్రలో

NBK 108 : బాలయ్య సినిమాలో శ్రీ లీల..ఏకంగా ఆ పాత్రలో

by Bunty
Ad

నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలుస్తూ పలు రికార్డులు తిరగరాసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాకు పోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఇక ప్రస్తుతం బాలయ్య NBK 108 సినిమాలో చేస్తున్నాడు.

READ ALSO : జూనియర్‌ NTR కు సుమ కౌంటర్….నందమూరి ఫ్యాన్స్ సీరియస్!

Advertisement

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లో 108వ చిత్రంగా వస్తుండగా, ఇప్పటికే షూటింగ్ సశరవేగంగా జరుపుకుంటుంది. కాగా, తాజాగా ఈ సినిమాలో శ్రీలీల అడుగుపెట్టినట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో శ్రీ లీల నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో ఈ బ్యూటీ నటిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Advertisement

READ ALSO : ఎన్టీఆర్ ‘దాన వీరశూరకర్ణ’ కు బడ్జెట్ కంటే 15 రేట్లు ఎక్కువ లాభాలు…

కాగా, బాలయ్య ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని విధంగా కనిపిస్తాడని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా యంగ్ బ్యూటీ శ్రీ లీల ‘పెళ్లి సందD’ మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక రీసెంట్గా శ్రీ లీల మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా మూవీలో నటించగా, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

READ ALSO : చంద్రమోహన్ అన్ని కోట్లు సంపాదించాడా… ఇండస్ట్రీలోనే కుబేరుడా?

Visitors Are Also Reading