Telugu News » Blog » ఫ్యాన్స్ కు దాదా షాక్.. అందులోనుండి తప్పుకుంటున్నాను అని..?

ఫ్యాన్స్ కు దాదా షాక్.. అందులోనుండి తప్పుకుంటున్నాను అని..?

by Manohar Reddy Mano
Ads

సౌరవ్ గంగూలీ.. భారత జట్టుకు కొత్త విధానం నేర్పిన ఈ కెప్టెన్ ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ళుగా ఈ పదవిలో ఉన్న గంగూలీ.. ఇప్పుడు తన ఫ్యాన్స్ అందరికి షాక్ అనేది ఇచ్చాడు. తాను ఈ నెలలో జరగబోతున్న లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో పాల్గొనడం లేదు అని ప్రకటించాడు. అయితే ఈ నెల 16న ఇండియా లెజెండ్స్ vs వరల్డ్ లెజెండ్స్ మధ్య మ్యాచ్ అనేది జరగనుంది.

Ads

అయితే ఈ ఏడాది ఆగస్టు 15తో ఇండియా 75 ఏళ్ళ స్వతంత్రంను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే ఇండియా vs వరల్డ్ మధ్య ఏ మ్యాచ్ నిర్వహించాలని ప్రభుత్వం బీసీసీఐని కోరింది. కానీ ఇప్పుడు ఉన్న జిబి షెడ్యూల్ వల్ల అది కుదరదు అని చెప్పిన బీసీసీఐ.. లెజెండ్స్ క్రికెట్ లో ఇది నిర్వహిస్తాం అని పేర్కొంది.

Ads

అందులో భాగంగానే జరగనున్న మ్యాచ్ లో గంగూలీ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవరించనున్నాడు అని బీసీసీఐ ప్రకటించింది. కానీ ఇప్పుడు తాజాగా దాదా ఈ మ్యాచ్ నుండే తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బీసీసీఐ ప్రెసిడెంట్ ఉన్న పనులు అలాగే వ్యక్తిగత కారణాల వల్లే ఈ మ్యాచ్ కు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపాడు. ఇక దాదా వెళ్లిపోవడంతో ఈ మ్యాచ్ లో ఇండియాకు ఎవరు కెప్టెన్సీ చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇక ఆ కెప్టెన్సీ సచిన్ కు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది.

Ad

ఇవి కూడా చదవండి :

షాకింగ్..ప్రపంచ కప్ కు కూడా ఆ ఆల్ రౌండర్ దూరం..!

మూడు మార్పులతో పాక్ పైకి భారత్..?