Home » సోన‌మ్ కుమారుడి పేరు ఏంటో తెలుసా.. పంచ భూతాలలో ఒక‌టి..!

సోన‌మ్ కుమారుడి పేరు ఏంటో తెలుసా.. పంచ భూతాలలో ఒక‌టి..!

by Anji
Ad

బాలీవుడ్ సోన‌మ్ క‌పూర్ గురించి అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా ఆమె సావారియా సినిమా ద్వారా సోన‌మ్ క‌పూర్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అనిల్ క‌పూర్ కూతురిగా పేరు తెచ్చుకున్న ఈమె ఆ తరువాత త‌న‌దైన ప్ర‌తిభ‌తో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర వేసింది. సోన‌మ్ మాత్రం సినిమాలో ఆశించిన స్థాయిలో ఎద‌గ‌లేదు. సోన‌మ్ త‌న చిర‌కాల ప్రియుడు ఆనంద్ అహుజాను 2018లో పెళ్లి చేసుకుంది.

Advertisement

ఈ దంప‌తులు త‌మ బిడ్డ‌కు వాయు అని పేరు పెట్టారు. దీనిపై సోన‌మ్ క‌పూర్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో త‌న బిడ్డ‌తో దిగిన క్యూట్ ఫోటోను షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోను చూసి అభిమానులు ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. మా జీవితాల‌కు కొత్త ఊపిరిని జోడించింది హ‌నుమంతుడు, భీముని రూపంలో మ‌న శ‌క్తి ధైర్యానికి చిహ్నం. త‌న కుమారుడు వాయుక‌పూర్ అహుజాకు ఆశీస్సులుండాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పింది. హిందూ మ‌తంలోని పంచ భూతాల్లో వాయు ఒక‌టి. వాయు త‌న‌లో ఉన్న శ‌క్తి మంతుడైన దేవుడు. అందుకోస‌మే మా కుమారుడికి వాయు అని అర్థం వ‌చ్చేవిధంగా పేరు పెట్టామ‌ని చెప్పుకొచ్చారు.

Advertisement

Also Read :  కూతురు చేసిన ప‌నికి రూ.100 కోట్లు పోగొట్టుకున్న కృష్ణంరాజు

సోన‌మ్ క‌పూర్‌, ఆనంద్ అహుజా గ‌త కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. మే 08, 2018న పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌రూ ఇప్పుడు త‌ల్లిదండ్రులుగా మారారు. సోన‌మ్ త‌న బిడ్డ పేరు గురించి సుదీర్ఘ‌మైన ఓ పోస్టు రాసుకొచ్చింది. శ్వాస దేవుడు, హ‌నుమంతుడు, భీముడు, మాధ‌వుల ఆధ్యాత్మిక తండ్రి న‌మ్మ‌శ‌క్యం కానీ శ‌క్తిమంతమైన పాల‌కుడు. వాయు అనేది జీవితం, ఇది విశ్వంలో జీవితం, తెలివితేట‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌క శ‌క్తి. ప్రాణ‌, ఇంద్రుడు, శివుడు, కాళీ దేవ‌త‌లు వాయువుతో సంబంధం క‌లిగి ఉన్నారు. చెడును నాశ‌నం చేసినంత సుల‌భంగా జీవుల‌కు జీవితాన్ని ఇస్తాడు. వాయును ధైర్య‌వంతుడు, మంత్ర‌ముగ్దుడ‌ని అభివ‌ర్ణించారు. కొద్ది రోజుల త‌రువాత సోన‌మ్ త‌న బిడ్డ‌ను పెంచే బాధ్య‌త త‌న భ‌ర్త‌కు అప్ప‌గిస్తాన‌ని చెప్పింది.

Also Read :  Puri: ఆ 3 బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్న పవన్ కళ్యాణ్..అసలు ఎందుకు రిజెక్ట్ చేశారో ఇప్పటికీ అర్థం కాలేదు..!!

Visitors Are Also Reading