Home » మన స్టార్ హీరోలు వారికి ఇష్టమైన వంటకాలు ఏవో తెలుసా ? బాలయ్యబాబు కి ఇష్టమైన వంట ఏదంటే ?

మన స్టార్ హీరోలు వారికి ఇష్టమైన వంటకాలు ఏవో తెలుసా ? బాలయ్యబాబు కి ఇష్టమైన వంట ఏదంటే ?

by AJAY

బ్ర‌తకడానికి ప్ర‌తిరోజూ చాలా ర‌కాల ఆహార‌ప‌దార్థాలు తింటూ ఉంటాం. కానీ కొన్ని ఫుడ్ ఐట‌మ్స్ మాత్రం ఎంతో ఇష్టంగా తింటాం. వాటినే మ‌నం ఫేవ‌రెట్ ఫుడ్ అంటూ ఉంటాం.

అలా టాలీవుడ్ లోని స్టార్ హీరోల‌కు కూడా కొన్ని ఫేవ‌రెట్ ఫుడ్ ఐట‌మ్స్ ఉన్నాయి. ఆ ఫుడ్ ఐట‌మ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం…

chiranjeevi

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి మంచి భోజ‌న ప్రియుడు అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే చిరుకు చేప‌ల పులుసు, రొయ్య‌ల వేపుడు ఫేవ‌రెట్ ఫుడ్ ఐట‌మ్స్…అంతే కాకుండా దోశ‌ల‌ను కూడా మెగాస్టార్ ఎంతో ఇష్టంగా లాగిస్తారు.

మ‌హేశ్ బాబుకు త‌న అమ్మమ్మ ఏం చేసి పెట్టినా చాలా ఇష్టమ‌ట‌. కానీ ఇప్పుడు మ‌హేశ్ బాబు డైటీషియ‌న్ స‌ల‌హా మేరకే త‌న‌కు ఇష్ట‌మైన ఆహారాల‌ను కూడా తీసుకుంటార‌ట‌.

prabhas

prabhas

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కూడా ఓ భోజ‌న ప్రియుడే.. అత‌డికి ఇంటినుండి వ‌చ్చే భోజ‌నం చూసి అంతా షాక్ అవుతుంటారు. ఇక ప్ర‌భాస్ కు బిర్యానీ, పానిపూరి, సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం.


బాల‌య్య సీజ‌న‌ల్ ఫుడ్స్ ను ఇష్ట‌ప‌డ‌తారు. ముఖ్యంగా బిర్యానీ మ‌రియు రొయ్య‌ల క‌ర్రీ బాల‌య్య‌కు చాలా ఇష్ట‌మట‌.

NAGARJUNA

NAGARJUNA

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున చూడ్డానికి ఫిట్ గా క‌నిపిస్తారు కానీ ఫుడ్ విష‌యంలో ఎలాంటి ఆంక్ష‌లు పెట్టుకోరు. ఎంత తినాలనిపిస్తే అంత తినేసి జిమ్ చేస్తారు. ఇక నాగ్ కు చేప‌లు మ‌రియు గ్రిల్డ్ చికెన్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు నెల్లూరు చేప‌ల పులుసు అంటే ఇష్ట‌మ‌ట‌. దాంతో పాటూ అర‌టికాయ వేపుడు ,ప‌ప్పు, నాటుకోడి పులుసు కూడా చాలా ఇష్టమ‌ట‌.

ఎన్టీఆర్ తిన‌డంతో పాటూ టేస్టీగా వంట కూడా చేస్తారు. నాటు కోడి కీమా, రోటీ మ‌రియు బిర్యానీని ఎన్టీఆర్ తిన‌డానికి ఇష్ట‌ప‌డతారు.

Visitors Are Also Reading