Home » Puri: ఆ 3 బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్న పవన్ కళ్యాణ్..అసలు ఎందుకు రిజెక్ట్ చేశారో ఇప్పటికీ అర్థం కాలేదు..!!

Puri: ఆ 3 బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్న పవన్ కళ్యాణ్..అసలు ఎందుకు రిజెక్ట్ చేశారో ఇప్పటికీ అర్థం కాలేదు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి.ఇందులో ప్రధానంగా చెప్పుకునేది బద్రి, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, పోకిరి, చిరుత, టెంపర్, అలాగే పూరి టాకీస్ బ్యానర్ మీద పోకిరి మరియు హార్ట్ ఎటాక్ చిత్రాలను నిర్మించారు.

Advertisement

అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పూరి జగన్నాథ్ రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేసి తర్వాత స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.. అలాంటి పూరీ పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు తీయాలని భావించారట.. వాటి కోసం కథ కూడా రెడీ చేసి పవన్ కళ్యాణ్ కు వినిపించారు.. కానీ ఆయన వీటిని రిజెక్ట్ చేశారట.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఇడియట్ :

ALSO READ;నా బ్యాచ్ హీరోలందరూ దొంగలే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి విజయశాంతి..!!

పూరి దర్శకత్వంలో రవితేజ, రక్షిత,ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఇడియట్ చంటిగాడి ప్రేమ కథ చిత్రాన్ని పవన్ కళ్యాన్ తో తీయాలని ఆయనకు ముందుగా కథ చెప్పారట.. కాని కుదరకపోవడంతో రవితేజ తో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు..

Advertisement

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి :


అలాగే పూరి డైరెక్షన్లో 2003లో వచ్చిన చిత్రం అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి.. ఇందులో రవితేజ,ఆసిన్,ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించారు.. దీనికి చక్రి సంగీతం తోడు కాగా సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ కథ ని కూడా ముందుగా పూరి పవన్ కళ్యాణ్ కి వినిపించారట..కానీ ఇది కూడా వర్కౌట్ కాలేదు..

పోకిరి :


ఇందిరా ప్రొడక్షన్ వైష్ణో అకాడమీ ఆధ్వర్యం లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి సినిమా సంచలన విజయం అందుకుంది. ఇందులో మహేష్ బాబు ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కథను కూడా ముందుగా పవన్ కళ్యాణ్ కు చెప్పారట పూరి జగన్నాథ్.. కానీ ఆయన రిజెక్ట్ చేశారని పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను బయటపెట్టారు..ఆయన ఈ మూడు కథలను ఓపికతో విన్నారు కానీ, నేను చేస్తాను లేదా చేయను అని చెప్పలేదని, అసలా స్టోరీస్ పవన్ కళ్యాణ్ కి నచ్చాయో లేదో ఇప్పటికీ నాకు తెలియదని పూరి జగన్నాథ్ తెలియజేశారు.

ALSO READ;మంగమ్మగారి మనవడు మూవీలో బాలయ్యకు NTR పెట్టిన 3 కండిషన్స్..ఏంటంటే..?

Visitors Are Also Reading