Home » ఆ హీరో మా ఇంటికి తాగొచ్చి రాద్దాంతం చేశాడు అంటున్న సీనియర్ నటి..!

ఆ హీరో మా ఇంటికి తాగొచ్చి రాద్దాంతం చేశాడు అంటున్న సీనియర్ నటి..!

by Anji
Ad

అలనాటి నటి నిర్మల గురించి ఈ తరానికి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఓ హీరో ఇబ్బంది పెట్టాడని తెలిపారు. 1965లో వచ్చిన వెన్నిరాడై తో తెరంగేట్రం చేసి.. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. నటి నిర్మల తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ కలిపి 400 కి పైగా చిత్రాలలో నటించిన ఆమె ఇటీవల ఓ యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలనాటి అగ్ర హీరోలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, వంటి వారితో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. 

Also Read :  Kota Srinivasa Rao : కోటను కూడా చంపే**రు కదరా..! పాపం ఇదెక్కడి ఖర్మరా బాబు!

Advertisement

ఓ కథానాయకుడు చేసిన గొడవను గుర్తు చేసుకున్నారు. ఆ హోరో పేరు మాత్రం వెల్లడించలేదు. తనకు ఎదురైనటువంటి చేదు అనుభవాన్ని వివరించారు. “ నేను అప్పట్లో నటించిన ఓ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన తరువాత ఇంటికి  చేరుకున్నాను. ఆ చిత్ర హీరో Maద్యం సేవించి మా ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. తలుపులు వేసి ఉండడంతో వాటిని తెలరవాలంటూ గట్టిగా అరిచాడు. ఫ్లీజ్.. నేనేం చేయను. ఇక్కడ నిద్రపోయి వెళ్లి పోతానంటూ రాద్దాంతం చేశాడు. జరిగిన విషయాన్ని మరుసటి రోజు ఉదయం ఆ సినిమా దర్శక, నిర్మాతలకు చెప్పాను. వారు నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాంటివి నాకు నచ్చవు అని బదులిచ్చి ఆ చిత్రం నుంచి వైదిలిగాను” అని తెలిపారు నిర్మల. 

Advertisement

Also Read :  భర్తతో గొడవలు… నిహారిక కోసం రంగంలోకి దిగిన చిరంజీవి?

భక్త ప్రహ్లదతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ తమిళ నటి అవే కళ్లు, మూగనోము, బాల నాగమ్మ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. కొద్ది రోజుల విరామం తరువాత శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి చిత్రంలో నటించారు. ఇక ఆ తరువాత అధిపతి, కలిసుందాం రా, జయం మనదేరా, నిన్నే ప్రేమిస్తా, స్నేహం కోసం, అర్జున్, శంకర్ దాదా ఎంబీబీఎస్ తదితర హిట్ సినిమాలలో కీలక పాత్ర పోషించి విశేషంగా అలరించారు. చివరగా నిర్మల 2010లో వచ్చిన ‘రగడ’ చిత్రంలో కనిపించారు.  

Also Read :  నా జీవితంలో మౌనిక వెళుతురు..మ‌నోజ్ మాట‌ల‌కు ఏడ్చేసిన మౌనిక‌..!

Visitors Are Also Reading