Home » Kota Srinivasa Rao : కోటను కూడా చంపే**రు కదరా..! పాపం ఇదెక్కడి ఖర్మరా బాబు!

Kota Srinivasa Rao : కోటను కూడా చంపే**రు కదరా..! పాపం ఇదెక్కడి ఖర్మరా బాబు!

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ నటుడు ఒకప్పటి విలన్ కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణ నటనకు ఆయన పెట్టింది పేరు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్రలో పరాకాయ ప్రవేశం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలోను కోట ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయన రీసెంట్ గాను కబ్జా సినిమాలో ఓ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

READ ALSO : తిరుమల భక్తులకు అలర్ట్….నడకదారి భక్తులకు దర్శనం టికెట్స్

Advertisement

అయితే ఈ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మరణించారంటూ వార్తను పుట్టించేశారు. దీంతో రంగంలోకి దిగిన కోట శ్రీనివాసరావు ఆ వార్తలను ఖండించారు. నేను బతికే ఉన్నాను, చనిపోలేదు అంటూ స్వయంగా ప్రకటించుకున్నారు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆయన చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఉదయం నుంచి ఫోన్లు వస్తున్నాయని, 50-60 కాల్స్ ను నేనే అటెండ్ చేశాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

READ ALSO : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!

Chiranjeevi should stop making unnecessary promises to film workers: Kota Srinivas Rao | Telugu Movie News - Times of India

ఆయన మార్చి 21వ తేదీ మంగళవారం ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. కోట శ్రీనివాసరావు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని అభిమానులను కోరారు. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని కోరారు కోట శ్రీనివాసరావు. ఇక ఈ వార్తలు పుట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

READ ALSO : ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి?

Visitors Are Also Reading