Home » నా జీవితంలో మౌనిక వెళుతురు..మ‌నోజ్ మాట‌ల‌కు ఏడ్చేసిన మౌనిక‌..!

నా జీవితంలో మౌనిక వెళుతురు..మ‌నోజ్ మాట‌ల‌కు ఏడ్చేసిన మౌనిక‌..!

by AJAY
Ad

మంచు మ‌నోజ్ రీసెంట్ గా భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికారెడ్డిని ప్రేమ‌వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌నోజ్ కు ఇది రెండో పెళ్లి కాగా మౌనిక కూడా ఇది రెండో వివాహ‌మే. అంతే కాకుండా మ‌నోజ్ మౌనిక‌లు మొద‌టి పెళ్లికి ముందే ఒక‌రినొక‌రు ప్రేమించుకున్న‌ట్టు తెలుస్తోంది. మౌనిక మొద‌టి పెళ్లిలో మ‌నోజ్ సంద‌డి చేశారు. కానీ అప్ప‌ట్లో మౌనిక తండ్రి పెళ్లికి నో చెప్ప‌డంతో ఇద్ద‌రూ విడిపోయార‌ని టాక్.

ALSO READ : Kota Srinivasa Rao : కోటను కూడా చంపే**రు కదరా..! పాపం ఇదెక్కడి ఖర్మరా బాబు!

Advertisement

ఇక ఇద్ద‌రికీ విడాకులు అవ‌డంతో త‌మ ప్రేమ‌ను గెలిపించుకున్నారు. ఇదిలా ఉంటే పెళ్లి త‌ర‌వాత మౌనికా మ‌నోజ్ ల జంట మొద‌టిసారి భ‌య‌ట‌కు వ‌చ్చారు. మోహ‌న్ బాబు పుట్టిన రోజు సంధర్బంగా ఆయ‌న‌తో పాటూ కుటుంబ స‌భ్యులు తిరుపతిలోని త‌మ విద్యాసంస్థ‌ల‌కు వెళ్లారు.

Advertisement

పుట్టిన‌రోజు వేడుక‌ల్లో మ‌నోజ్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర కామెంట్ లు చేశారు. జీవితంలో గెలుపోట‌ములు స‌హ‌జ‌మ‌ని అన్నారు. ప్ర‌తిఒక్క‌రి జీవితంలో ఏదో ఒక‌స‌మ‌యంలో అంద‌కారం చుట్టివేస్తుంది. నా జీవితంలో కూడా అలాంటి అంద‌కారం వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో నా కుటుంబం నాకు అండ‌గా ఉంది.

అంతే కాకుండా మౌనిక నా జీవితంలోకి వెళుతురులా వ‌చ్చింది. ప్ర‌తి మ‌గాడి విజ‌యం వెన‌క ఆడవాళ్లు ఉంటారు. ఆడ‌వాళ్ల విజ‌యం వెన‌క కూడా మ‌గాళ్లు ఉండాలి. అంటూ మ‌నోజ్ స్పీచ్ ఇచ్చారు. ఇక మ‌నోజ్ స్పీచ్ ఇస్తున్న సమ‌యంలో మౌనిక‌రెడ్డి ఎమోష‌న‌ల్ అయ్యారు. అంతే కాకుండా ఏడ్చేశారు.

ALSO READ :Kota Srinivasa Rao : కోటను కూడా చంపే**రు కదరా..! పాపం ఇదెక్కడి ఖర్మరా బాబు!

Visitors Are Also Reading