Home » భారత్ ను అవమానించేలా పాక్ వ్యాఖ్యలు.. హెల్మెట్ అవసరం లేదని..?

భారత్ ను అవమానించేలా పాక్ వ్యాఖ్యలు.. హెల్మెట్ అవసరం లేదని..?

by Azhar
Ad
ఇండియా vs పాకిస్తాన్ అనేది ప్రపంచంలో ఉన్న గొప్ప రైవలరీలలో ఒక్కటి. అయితే ఈ మధ్య ఈ రెండు దేశాలు యుద్ధాలు చేసుకోకపోయినా ఫ్యాన్స్ మాత్రం క్రికెట్ మ్యాచ్ లనే యుద్ధంలా భవిస్తూ వస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ నెల 23న ప్రపంచ కప్ లో భాగంగా ఈ రెండు దేశాలు పోటీ పడబోతున్నాయి. ఈ సమయంలో ఇండియాను అవమానించేలా పాక్ మాజీలు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
అయితే తాజాగా పాకిస్తాన్ మాజీ  సారథి సల్మాన్ భట్ భారత బౌలింగ్ గురించి మాట్లాడాడు. భారత జట్టు యొక్క పేస్ బౌలింగ్ అనేది ఎప్పుడు వీక్ గానే ఉండేది అని అతను పేర్కొన్నారు. ఇక అందుకు ఉదాహారణగా గతంలో వారు చేసిన పనులు అనేవి చెప్పారు. ఎప్పుడైనా వన్డేలలో మిడిల్ ఓవర్ లలో స్పిన్నర్లు బౌలింగ్ చేస్తారు కాబట్టి.. బ్యాటర్లు హెల్మెంట్ అనేది పెట్టుకోకుండా బ్యాటింగ్ చేస్తారు.
కానీ ఇండియాతో మ్యాచ్ అనే సమయానికి మాత్రం మా ఆటగాళ్లు మిడిల్ ఓవార్లలోనే కాకుండా.. ఓపెనింగ్ నుండే హెల్మెంట్ లేకుండా ఆడేవారు. ఎందుకంటే మా ఆటగాళ్లకు తెలుసు. ఇండియా యొక్క పేస్ బౌలింగ్ అనేది అంతలా ఏం ఉండదు అని సల్మాన్ భట్ పేర్కొన్నారు. ఇక ఈ కామెంట్స్ పై ఇండియా ఫ్యాన్స్ కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. మా పేసర్లు వీక్ అని మీరు ఎలా అనుకున్నారో.. మీ బ్యాటర్లను ఔట్ చేయడానికి స్పిన్నర్లే ఎక్కువ అని మా ఇండియా కు తెలుసు అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading