Telugu News » Blog » కోహ్లీకి మద్దతుగా… కపిల్ కు పంచ్ ఇచ్చిన రోహిత్..!

కోహ్లీకి మద్దతుగా… కపిల్ కు పంచ్ ఇచ్చిన రోహిత్..!

by Manohar Reddy Mano
Ads

టీం ఇండియా గురించి ఎక్కడ చర్చ వచ్చిన కూడా కోహ్లీ గురించి మాట్లాడకుండా ఎవరు ఉండరు. అయితే ఒక్కపుడు విరాట్ సాధించిన రికార్డుల గురించి మాట్లాడే వారు.. ఇప్పుడు విరాట్ వరుస వైఫల్యాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కోహ్లీ గత మూడేళ్ళుగా సెంచరీ చేయలేదు అని.. ప్రతి మ్యాచ్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ.. వికెట్ ను కోల్పోతున్నాడు అని అంటున్నారు. ఇక ఐపీఎల్ 2022 వరకు కోహ్లీకి అభిమానులతో పాటుగా మాజీ ఆటగాళ్లు కూడా మద్దతుగా నిలిచారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

Advertisement

ఐపీఎల్ 2022 తర్వాత కోహ్లీ విశ్రాంతి తీసుకున్న సమయంలో వచ్చిన యువ ఆటగాళ్లు అందరూ బాగా రాణించారు. కానీ విశ్రాంతి తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన విరాట్ మాత్రం పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు. అక్కడ జరిగిన టెస్ట్ మ్యాచ్ తో పాటుగా తాజాగా జరిగిన టీ20 సిరీస్ లో కూడా కోహ్లీ పరుగులు చేయలేదు. దాంతో భారత మాజీ ఆటగాళ్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అజయ్ జడేజా, సెహ్వాగ్ వంటివారు కోహ్లీని జట్టు నుండి తీసేయాలి.. బాగా రాణిస్తున్న కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలో నిన్న టీ20 సిరీస్ ముగిసిన తర్వాత మీడియాతో రోహిత్ మాట్లాడాడు. అప్పుడు అక్కడ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. కపిల్ దేవ్ ఇలా కోహ్లీని జట్టు నుండి తీసేయాలి అంటున్నారు.. కెప్టెన్ గా మీరేం అంటారు అని ప్రశ్నించగా.. రోహిత్ సమాధానం ఇస్తూ… బయట ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది మాకు అవసరం లేదు. జట్టులో ఏం జరుగుతుంది అనేదే మాకు ముఖ్యం. ఆ విమర్శలు చేసేవారు బయట ఉన్నారు. కాబట్టి వారిని మేము పట్టించుకోము. ఇక కోహ్లీ ఫామ్ తో మాకు ఏం సమస్య లేదు అని రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఫామ్ అనేది శాశ్వతం కాదు.. కానీ క్వాలిటీ అనేది శాశ్వతం కాబట్టి మేము దానినే చూస్తాం అని రోహిత్ చెప్పాడు.

 

Advertisement

ఇవి కూడా చదవండి :

ఇండియాను ఓడించడం పాకిస్థాన్ కు కష్టమే…!

కోహ్లీని టీ20ల్లో నుండి తప్పించాలి అంటున్న జడేజా..!