Home » మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్ లోనే ఇషాన్ కిషన్ ని కొట్టబోయిన రోహిత్ శర్మ..!

మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్ లోనే ఇషాన్ కిషన్ ని కొట్టబోయిన రోహిత్ శర్మ..!

by Anji

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆసిస్ మధ్య నాలుగవ మ్యాచ్ ఇవాళ ప్రారంభమైంది. మొదటి రోజు మ్యాచ్ లో ఆసిస్ ఆదిపత్యం చెలాయించింది. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ వికెట్లు మాత్రం తీయలేకపోయారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన అసహనాన్ని బౌలర్ ఇషాన్ కిషన్ పై చూపించాడు. మైదానంలోకి వాటర్ ఇవ్వడానికి వచ్చిన ఇషాన్ కిషన్ ని కొట్టబోయాడు రోహిత్ శర్మ. 

Also Read :  ఆస్కార్ కోసం రాజమౌళి ఖర్చుపై తమ్మారెడ్డి భరద్వాజ ఏమన్నారంటే..?

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత కొంత కాలంగా సహనం కోల్పోతూ ఇతర ఆటగాళ్లపై నోరు పారేసుకుంటున్నాడు. గతంలో వాషింగ్టన్ సుందర్ ని బూతులు తిట్టిన రోహిత్ శర్మ.. అర్షదీప్, భువనేశ్వర్, డీకేలపై తన ఆగ్రహాన్ని చూపించాడు. మరోమారు తన అసహనాన్నిచూపించాడు రోహిత్. తాజాగా ఆసిస్ తో జరుగుతున్నటువంటి కీలకమైన నాలుగో టెస్ట్ తొలిరోజు ఈ సంఘటన  చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 60వ ఓవర్ ముగిసిన తరువాత ఇషాన్ కిషన్ ఆటగాళ్ల కోసం వాటర్ బాటిల్స్ ని పట్టుకొని గ్రౌండ్ లోకి వచ్చాడు. 

Also Read :   80 కోట్ల‌తో 8 సినిమాలు తీసి మొహాన కొట్టొచ్చు…ఆర్ఆర్ఆర్ పై త‌మ్మారెడ్డి సంచ‌ల‌నం..!

ఈ క్రమంలోనే ఓ బాటిల్ ని తీసుకొని రోహిత్ తాగుతుండగా.. మరికొన్ని బాటిల్స్ ని స్లిప్ లో ఉన్న ఫీల్డర్స్ కి పరుగెత్తుకెళ్లి ఇచ్చాడు ఇషాన్. తరువాత బాటిళ్లను కలెక్ట్ చేసుకున్న ఇషాన్ వేగంగా పరుగెత్తుకు వచ్చి రోహిత్ దగ్గర ఉన్నటువంటి బాటిల్ ని అందుకోబోయాడు. వేగం కారణంగా బాటిల్ చేతిలో చిక్కకుండా కింద పడిపోయింది. దీంతో మళ్లీ వేగంగా వెనక్కి వచ్చిన ఇషాన్ కింద పడినటువంటి బాటిల్ ని అందుకుంటుండగా.. రోహిత్  అతన్ని కొట్టేందుకు చేయి లేపాడు. ఇది గమనించిన ఇషాన్ తప్పించుకొని వేగంగా పరుగెత్తాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు కూడా ఇలాగే బిహేవ్ చేశావు.. ఇంక మారవా..? అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read :   44 బంతుల్లోనే సెంచరీ.. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ ఆటగాడు..!

Visitors Are Also Reading