Home » 44 బంతుల్లోనే సెంచరీ.. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ ఆటగాడు..!

44 బంతుల్లోనే సెంచరీ.. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ ఆటగాడు..!

by Anji

సాధారణంగా టీ-20 క్రికెట్ లో 200 పరుగులు టార్గెట్ చేధించాలంటే చాలా కష్టపడుతుంటారు. 245 పరుగుల లక్ష్య చేధన అంటే.. ఇంకా ఏమైనా ఉందా.. అసలు చేధించడం కష్టమే అని.. ఆ జట్టు ఓడిపోతుందని చెబుతుంటారు ఎవరైనా.. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది క్వెట్టా గ్లాడియేటర్స్. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పరుగుల వరద ఏరులై పారింది. టీ-20 చాలా అరుదుగా రికార్డు బ్రేక్ చేశారు ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు, ఒక అర్థ సెంచరీ నమోదు అయింది. 

Also Read :  ఇన్ ఫ్లూయెంజాతో ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..!

పీఎస్ఎల్ లో బాబర్ అజామ్ తొలి సెంచరీ నమోదు బాదేశాడు. జాసన్ రాయ్ సుడిగాలి ఇన్నింగ్స్ బాదేశాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్ గా వచ్చిన ఇంగ్లాండు వెటరన్ బ్యాట్స్ మెన్ జాసన్ రాయ్ పీఎస్ఎల్ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడి రికార్డులోకి ఎక్కాడు. విధ్వంసకర బ్యాట్స్ మెన్ 63 బంతుల్లో అజేయంగా 145 పరుగులు చేసి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. పెషావర్ జల్మీ విధించిన 241 పరుగుల భారీ లక్ష్యానికి చేధించే క్రమంలో.. రాయ్ కేవలం 44 బంతుల్లోనే తుఫాన్ సెంచరీని పూర్తి చేసాడు. అంతేకాదు.. చివరి వరకు నాటౌట్ గా నిలిచి 10 బంతులు మిగిలి ఉండగానే తన జట్టుకు విజయాన్ని అందించాడు. 

Also Read :  సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి

Manam News

ఈ సమయంలో రాయ్ 20 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. అదేవిధంగా రాయ్ తో పాటు మహ్మద్ హఫీజ్ కూడా 41 పరుగులు చేసి జట్టు విజయంలో సహాయపడ్డాడు.వీరు కేవలం 39 బంతుల్లో అజేయంగా 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొలిపి లక్ష్యాన్ని చాలా సులభం చేసారు ఈ లక్ష్య చేధన పీఎస్ఎల్ లోనే కాదు.. ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్దదనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో 483 పరుగులు నమోదు అయ్యాయి. అంతకుముందు పెషావర్ తరుపున కెప్టెన్ బాబర్ అజామ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అజేయంగా 115 పరుగులు చేశాడు. పీఎస్ఎల్ చరిత్రలో అతనికి ఇది మొదటి సెంచరీ. అయినప్పటికీ జట్టుకు ఇది సరిపోలేదు. బాబర్ తో పాటు పెషావర్ లో సైమ్ అయూబ్ కూడా 74 పరుగులు చేశాడు. 

Also Read : మహిళా దినోత్సవం రోజే మహాలక్ష్మీ పుట్టిందంటున్న టీమిండియా క్రికెటర్..

Visitors Are Also Reading