Home » వానాకాలంలో కీళ్ల నొప్పులు బాగా ఎక్కువయ్యాయా..? ఇలా చేస్తే రిలీఫ్ ఉంటుంది..!

వానాకాలంలో కీళ్ల నొప్పులు బాగా ఎక్కువయ్యాయా..? ఇలా చేస్తే రిలీఫ్ ఉంటుంది..!

by Sravya
Ad

చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా వానాకాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. వానా కాలంలో కీళ్ల నొప్పులు నుండి బయట పడాలంటే ఇలా చేయడం మంచిది. వానా కాలంలో శరీరంలో నీటి కొరత కారణంగా తరచు తేమని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కీళ్ల నొప్పులు నివారించడానికి హైడ్రాయిడ్ గా ఉండడం మంచిది. రోజు ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు తాగితే కీళ్ల నొప్పులు రావు. ప్రతిరోజు వ్యాయామం చేస్తే కూడా కీళ్ల నొప్పులు రావు.

Advertisement

Advertisement

మిమ్మల్ని మీరు ఫ్లెక్సిబుల్ గా మార్చుకోవడానికి కొన్ని వ్యాయామాలు రోజు చేస్తూ ఉండండి చెప్పులు లేదా షూ వంటి వాటిని వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సౌకర్యవంతమైన వాటిని మాత్రమే వాడండి. వానా కాలంలో కీళ్ల నొప్పులు బాగా ఎక్కువైనపుడు వేడి నీటి బ్యాగు లేదంటే ఐస్ బ్యాగ్ ని పెట్టుకోండి. దాంతో ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా వానా కాలంలో కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోండి తాజా పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోవచ్చు. ఇలా ఈ జాగ్రత్తలని తీసుకోవడం ఈ చిట్కాలని పాటించడం వలన వానాకాలంలో కీళ్ల నొప్పుల నుండి ఈజీగా బయటపడవచ్చు.

Also read:

Visitors Are Also Reading