Home » అంబానీ, ఆదానీ కాదు.. ఈ ఏడాది అత్యధిక సంపాదన ఆవిడదే..!

అంబానీ, ఆదానీ కాదు.. ఈ ఏడాది అత్యధిక సంపాదన ఆవిడదే..!

by Anji
Ad

దేశంలో అత్యంత సంపన్నుల జాబితా తీస్తే అంబానీ, అదానీ పేర్లే సాధారణంగా వినిపిస్తాయి. కానీ ఈ ఏడాది అత్యధిక సంపదను అర్జించిన జాబితాలో ఈసారి సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం సంపద 25.3 బిలియన్ డాలర్లే అయినా ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద 9.6 బిలియన్ డాలర్లు మేర పెరిగింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు.


జిందాల్ గ్రూప్ స్థాపించిన ఓంప్రకాశ్ జిందాల్ సతీమణి సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం ఓపీ జిందాల్ గ్రూప్ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్ లో జేఎస్ డబ్ల్యూ స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్, జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్ లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో పరుగులు పెట్టాయి. దీంతో సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది. దేశంలో కుబేరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచినా.. ఉపఖండంలో మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం.

Advertisement

Advertisement


ఇక ఈ జాబితాలో హెచ్ సీఎల్ టెక్ అధినేత శివ్ నాడార్ 8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ లిమిటెడ్ చైర్మన్ కేపీ సింగ్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాదిలో ఆయన సంపద 7.15 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ 6.3 బిలియన్ డాలర్ల సంపదను పెంచుకున్నారు. ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది 5.2 బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగింది. సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, రవి జైపూరియా, ఎంపీ లోథా, సునీల్ మిత్తల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. హిండెన్ బర్గ్ రీసెర్చీ నివేదికతో గౌతమ్ అదానీ భారీగా సంపద పోగొట్టుకోవడంతో ఈ జాబితాలో రివర్స్ లోకి వెళ్లారు. ఇక ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ దేశంలోనే తొలి స్థానంలో ఉన్నారు. అదానీ రెండో స్థానంలో ఉన్నారు.

మరిన్ని  తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading