Home » కొత్త సంవత్సరం ఈ నక్షత్రంలో ప్రారంభం.. ఈ రాశుల వారికి అనుకూలం..!

కొత్త సంవత్సరం ఈ నక్షత్రంలో ప్రారంభం.. ఈ రాశుల వారికి అనుకూలం..!

by Anji
Ad

నూతన సంవత్సరం 2023 ప్రారంభమవ్వడానికి కేవలం 18 రోజుల సమయం మాత్రమే ఉంది. కొత్త సంవత్సరంలో ప్రతీ వ్యక్తికి కొత్త ఆశలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి పరంగా నూతన సంవత్సరం బాగుంటుందా లేక కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జనవరి 01,2023న శివ, అమృతం, సర్వార్థ సిద్ధి యోగాల కలయిక జరుగుతుంది. అదేవిధంగా అశ్వనీ నక్షత్రంలో ఏడాది ప్రారంభమవుతుంది. కేతు గ్రహాన్నిఅశ్విని నక్షత్రానికి ఆది దేవతగా భావిస్తారు. అదేవిధంగా జ్యోతిష్యశాస్త్రంలో శివ, అమృతం, సర్వార్థ సిద్ధి యోగం చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతాయి. అందుకే ఈ శుభయోగాలు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంటాయి. ఈ మూడు రాశి చక్ర గుర్తులున్నాయి. ఈ ఏడాది వీరు వ్యాపారంలో మంచి పురోగతిని సాధిస్తారు. ఈ మూడు రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

మేషరాశి 

వీరు వృత్తి, వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం. మీరు ప్రయాణించే దారిలోనే వ్యాపారంలో లాభాలు సంభవిస్తాయి. భవిష్యత్ లో 2023  వీరికి ఆర్థికంగా మంచిగా కలిసొస్తుంది. 

Advertisement

వృషభ రాశి 

ఈ ఏడాదిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ఏదైనా ఉద్యోగంలో మీరు పని చేస్తున్నట్టయితే ఏప్రిల్ మాసంలో ప్రమోషన్ పొందే అవకాశముంది. ఈ ఏడాది తండ్రితో సంబంధాలు బాగుంటాయి. తండ్రి సహకారంతో లాభాలుంటాయి. అదేసమయంలో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారి కల సహకారమవుతుంది. 

మకర రాశి 

ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఈ ఏడాది మీరు ఆకస్మిక ద్రవ్య లాభాలను పొందవచ్చు. అనగా మీ దగ్గర నిలిచిపోయిన డబ్బును మీరు పొందవచ్చు. అదేవిధంగా ఈ ఏడాది మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు కూడా చేయవచ్చు. నిలిచిపోయిన మీ ప్రణాలికలో మీరు విజయాన్ని పొందవచ్చు. అదేసమయంలో వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. 2023 ప్రధానంగా ఈ రాశుల వారు లక్కీ పర్సన్స్ అనే చెప్పవచ్చు. 

Also Read :  మహేష్ బాబు అభిమానులకు శుభవార్త.. ఒక్కడు రీ రిలీజ్ అప్పుడే..!

 

Visitors Are Also Reading