Home » మహేష్ బాబు అభిమానులకు శుభవార్త.. ఒక్కడు రీ రిలీజ్ అప్పుడే..!

మహేష్ బాబు అభిమానులకు శుభవార్త.. ఒక్కడు రీ రిలీజ్ అప్పుడే..!

by Anji
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ నెలలో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి, నవంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. వీరిద్దరి మరణంతో కాస్త గ్యాప్ తీసుకొని ఎస్ఎస్ఎంబీ 28 సినిమా త్వరలో షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో పాత సినిమాలను విడుదల చేయడం ఆ సినిమాలు భారీ విజయం సాధించడం ఓ ట్రెండ్ కొనసాగుతోంది. ఆ కోవలోనే బాలయ్య చెన్నకేశవరెడ్డి, మహేష్ బాబు పోకిరి, ప్రభాస్ బిల్లా, వర్షం, నువ్వే నువ్వే, చిరంజీవి ఘరానా మొగుడు వంటి చిత్రాలు రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విక్టరీ వెంకటేష్ నారప్ప రీ రిలీజ్ చేశాడు. 

Advertisement

Advertisement

తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన మరో చిత్రం ఒక్కడు కూడా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. మహేష్ కెరీర్ లో ఒక్కడు కెరీర్ లో ఒక్కడు చిత్రానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2003 జనవరిలో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనమే సృష్టించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్సన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం రికార్డు సెట్టర్ గా నిలిచింది. భూమిక హీరోయిన్ గా.. ప్రకాశ్ రాజ్ విలన్ పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదలై 20 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో మళ్లీ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఒక్కడు సినిమాని రీ రిలీజ్ చేయనున్నారు. 

Also Read :  కృష్ణకు ఘోర అవమానం.. పద్మాలయ స్టూడియోలోకి వెళ్లకుండా ఆపారు.. ఎందుకో తెలుసా ?

2023 జనవరి 07న ఒక్కడు సినిమా రీ రిలీజ్ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సినిమాని విడుదల చేయడానికి ఇప్పటికే ప్లానింగ్స్ ప్రారంభించారు. ఇదిలా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలల మరో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన తరువాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే.  

Also Read :  బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో స్టార్ హీరోయిన్ కి ఫోన్ చేసిన ప్రభాస్.. ఎందుకోసమంటే ? 

Visitors Are Also Reading