Home » అభివృద్ధికి కేరాఫ్ జిల్లా.. ఆదివాసి గూడాల‌కు జాతీయ స్థాయి గుర్తింపు

అభివృద్ధికి కేరాఫ్ జిల్లా.. ఆదివాసి గూడాల‌కు జాతీయ స్థాయి గుర్తింపు

by Anji
Ad

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ఆదివాసి గిరిజ‌న గ్రామం. అక్క‌డ అన్ని ప‌చ్చ‌ని చెట్లు, కుంట‌లు, చెరువులు, పంట పొలాలు, ఎత్తైన కొండ‌కు ఆనుకొని ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో అల‌లారుతున్న గిరిజ‌న గూడెం. చారిత్రాత్మ‌క నేప‌థ్యం క‌లిగిన ఈ గ్రామం ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు ద‌క్కించుకున్న‌ది. ఈ గిరిజ‌న గూడెంలో కేవ‌లం 708 మంది జ‌నాభాతో 130 నివాసాలు ఉన్నాయి. గోండు గిరిజ‌న తెగ‌కు చెందిన వారు ఉండ‌డం విశేషం. నిన్న‌టి వ‌ర‌కు ఓ ఆదివాసి గిరిజ‌న గూడెంగా ఉన్న ఆ గ్రామం పేరు జాతీయ స్థాయిలో మారు మ్రోగిపోతోంది.

Advertisement

మాన‌వాభివృద్ధిలో భాగంగా నిత్య స‌దుపాయాలు, వైద్యం, పోష‌కాహారం, సామాజిక భ‌ద్ర‌త వంటి అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధి, జీవ‌నోపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక చేకూర్పు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, సామాజిక న్యాయం, సుప‌రిపాల‌న వంటి అంశాల్లో అభివృద్ధిని కొల‌మానంగా తీసుకొని ఆద‌ర్శ గ్రామాల‌ను ర్యాంకుల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. గ్రామ‌స్తుల ఐక్య‌త‌, అధికారుల కృషి ఫ‌లితంగానే త‌మ‌కు ఈ గౌర‌వం ద‌క్కింద‌ని.. మైదాన ప్రాంత గ్రామాలకు ఏ మాత్రం తీసిపోనివిధంగా మార్ల‌వాయి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి ఫ‌లాల‌ను సాధించే దిశ‌గా ముంద‌డుగు వేస్తోంది. ఈ గ్రామానికి మ‌రొక ప్ర‌త్యేక‌త కూడా ఉంది.

Advertisement

గ‌త ఏడాది కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌దానం చేసిన నాలుగ‌వ అత్యున్న‌త పౌర పురస్కారం ప‌ద్మ శ్రీ ఈ గ్రామానికి చెందిన గుస్సాడి నృత్య గురువు క‌న‌క‌రాజును వ‌రించింది. ఢిల్లీలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో క‌న‌క‌రాజు ఈ పుర‌స్కారాన్ని రాష్ట్రప‌తి చేతుల మీదుగా అందుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. సంస‌ద్ ఆద‌ర్శ గ్రామీణ యోజ‌న కార్య‌క్ర‌మంలో జాతీయ స్థాయిలో నాలుగ‌వ స్థానంలో నిలిచిన సిర్పూర్ (యూ) మండ‌లంలోని మ‌హ‌గాంలోనూ ఇదే ర‌క‌మైన అభివృద్ధి సూచిక‌లు న‌మోద‌వ్వ‌డంతో ఈ గ్రామానికి గుర్తింపు ల‌భించింది.

 


ఈ గ్రామానికి మ‌రో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఈ గ్రామంలో ఎవ్వ‌రూ కూడా మాంసం ముట్ట‌రు. పొగ‌త్రాగ‌రు, మ‌ద్యం సేవించ‌డం వంటి దుర‌ల‌వాట్ల‌కు దూరంగా ఉంటారు. ద‌శాబ్దాల క్రితం మ‌హారాష్ట్రకు చెందిన సూరోజి బాబా ఈ గ్రామానికి వ‌చ్చి ఆధ్యాత్మిక బోధ‌న‌లు చేసారు. ఆ మ‌హారాజ్ బోధ‌న‌ల‌కు ఆక‌ర్షితులైన ఇక్క‌డి గిరిజ‌నులు స్వచ్ఛందంగా చెడు, అల‌వాట్లు, మ‌ద్యం, మాంసాల‌కు దూరంగా ఉంటున్నారు.ఏది ఏమైనప్ప‌టికీ మారుమూల‌న ఉన్న ఈ ఆదివాసి గిరిజ‌న గూడాలు జాతీయ స్థాయిలో మెరిసిపోవ‌డంతో ఇక్క‌డి గిరిజ‌నులు మురిసిపోతున్నారు. ప‌ల్లెలు ప‌చ్చ‌గా ప‌రిశుభ్రంగా ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిన‌ట్టుగా తెలుస్తుంద‌నే మాట‌కు నిద‌ర్శ‌నం కొమురంభీమ్ జిల్లాలోని గ్రామాలు. త‌మ గ్రామాల‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్క‌డంతో హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు ప్ర‌జ‌లు.

Also Read : 

“అమ్మోరు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఎలా ఉంది..ఏం చేస్తుందో తెలుసా…?

Visitors Are Also Reading