Home » “అమ్మోరు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఎలా ఉంది..ఏం చేస్తుందో తెలుసా…?

“అమ్మోరు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఎలా ఉంది..ఏం చేస్తుందో తెలుసా…?

by AJAY
Ad

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు క్రియేట్ చేస్తాయి. ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలాంటి సినిమాల్లో అమ్మోరు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా స్వర్గీయ హీరోయిన్ సౌందర్య, సురేష్ కలిసి నటించారు. ఈ సినిమాలో రామిరెడ్డి, రమ్యకృష్ణ, కళ్ళు చిదంబరం, ప్రధాన పాత్రలలో నటించారు. 1995 సంవత్సరం లో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసింది.

Advertisement

ఈ సినిమాకు ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ చిత్రం టీవీ లో వస్తే మిస్ కాకుండా చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలో నటించిన రామిరెడ్డి, కళ్ళు చిదంబరం, సౌందర్య, రమ్యకృష్ణ తమ నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. సినిమా లోని ముఖ్యమైన అమ్మోరు పాత్రలో చిన్నారి నటించింది.

Advertisement

ఇక ఆ చిన్నారి అసలు పేరు సునయన. అమ్మోరు సినిమా లో సునయన కు ఎంతో గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా వచ్చి దాదాపు 27 ఏళ్లు అవుతున్న సంగతి తెలిసిందే. కానీ సునయన మాత్రం అమ్మోరు తరవాత అంతటి ప్రాధాన్యత ఉన్న సినిమా చేయలేదు. రీసెంట్ గా నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ అనే సినిమాలో నటించింది.

ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సునయన కూడా ముఖ్యమైన పాత్రలో నటించగా తన నటన తో ఆకట్టుకుంది. సునయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ యూట్యూబ్ లో “ప్రస్టేటెడ్ ఉమెన్” అనే ఛానల్ ద్వారా వీడియోలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె యూట్యూబ్ ఛానల్ కు చాలా మంది సబ్ స్కైబర్లు ఉన్నారు.

Also read :

అల్లు అర్జున్ దెబ్బ‌కు తుఫాన్ లో కొట్టుకుపోయిన మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ సినిమాలు ఏవో తెలుసా..!

Visitors Are Also Reading