Home » పూర్తిగా మారిపోయిన‌ నాగ‌బాబు…అందుకోస‌మేనా..?

పూర్తిగా మారిపోయిన‌ నాగ‌బాబు…అందుకోస‌మేనా..?

by AJAY

ట‌వ‌ర్ స్టార్ నాగ‌బాబు ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. మెగాస్టార్ బ్ర‌ద‌ర్ గా హీరోగా ప‌రిచ‌య‌మైన నాగబాబు స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయారు. ఆ త‌ర‌వాత నిర్మాత‌గా మారి అనేక చిత్రాలు చేశారు. అక్క‌డ కూడా నాగ‌బాబును విధి వెక్కిరించింది. కానీ నాగ‌బాబు బుల్లితెర‌పై మాత్రం సూప‌ర్ స‌క్సెస్ ను అందుకున్నారు. అప్ప‌ట్లో ఓ టీవీ సీరియ‌ల్ లో న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆ త‌వ‌రాత జ‌బ‌ర్ద‌స్త్ నుండి నాగ‌బాబు ద‌శ తిరిగిపోయింది.

జ‌బర్దస్త్ లో జ‌డ్జిగా అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ ను పుచ్చుకుని ప్రేక్ష‌కుల‌ను త‌న జ‌డ్జిమెంట్ తో మెప్పించారు. జ‌బ‌ర్ద‌స్త్ నుండి వెళ్లిపోయిన త‌ర‌వాత సొంత యూట్యూబ్ ఛాన‌ల్ లో వీడియోలు చేయడం…అంతే కాకుండా కామెడీస్టార్స్ లో కూడా జ‌డ్జిగా చేయ‌డంతో మ‌ళ్లీ బిజీగా మారిపోయారు. ఇదిలా ఉంటే నాగ‌బాబు జ‌న‌సేన త‌ర‌పున గ‌త ఎన్నిక‌ల‌లో పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. నాగ‌బాబు ఎంపీ గా పోటీ చేస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎమ్మెల్యేగా రెండు స్థానాల‌లో పోటీ చేశారు. కానీ ఇద్ద‌రూ ఓడిపోయారు.

కాగా ఇప్పుడు నాగ‌బాబు త‌న పూర్తిదృష్టిని రాజ‌కీయాల‌పైనే పెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల త‌న పుట్టిన‌రోజు సంధ‌ర్బంగా కూడా నాగ‌బాబు దీనిపైనే ప్ర‌క‌టన చేశారు. గ‌త కొద్ది రోజులుగా ఏపీలో ప‌లు కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు. దానికి తోడు ఇప్పుడు నాగ‌బాబు త‌న గెట‌ప్ ను కూడా పూర్తిగా మార్చేశారు. రాజకీయ‌నాయ‌కులు సాధార‌ణంగా తెల్ల‌దుస్తులు ధ‌రిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే.

nagababu

nagababu

ఇప్పుడు నాగ‌బాబు కూడా అదే లుక్ లో క‌నిపిస్తున్నారు. తెలుపు దుస్తులు మొడ‌లో తెలుపు రుమాలు చేతిలో పుస్త‌కం ప‌ట్టుకుని సిస‌లైన రాజ‌కీయనాయ‌కుడి లుక్ లో క‌నిపిస్తున్నారు. తాజాగా ఫోటోను షేర్ చేసిన నాగ‌బాబు ఆ ఫోటోకు ఈ జీవితం ప్ర‌జాసేవ‌కు అంకితం అంటూ రాసుకొచ్చారు. ఇక ప్ర‌జ‌ల‌కోసం పూర్తిగా మారిపోయిన నాగ‌బాబు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఎలా ఉంటుందో చూడాలి మ‌రి.

ALSO READ : 

ఆ హీరోయిన్ అంటే కోట శ్రీనివాసరావుకు చాలా ఇష్టమట.. కానీ ఏం చేస్తాం..!!

“స్వాతిముత్యం”లో క‌మ‌ల్ హాస‌న్ భార్య‌ దీప ఇప్పుడు ఎక్క‌డ ఉందో… ఏం చేస్తుందో తెలుసా..!

 

Visitors Are Also Reading