Home » ఆ హీరోయిన్ అంటే కోట శ్రీనివాసరావుకు చాలా ఇష్టమట.. కానీ ఏం చేస్తాం..!!

ఆ హీరోయిన్ అంటే కోట శ్రీనివాసరావుకు చాలా ఇష్టమట.. కానీ ఏం చేస్తాం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా సీనియర్ నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ఆల్ రౌండర్ నటుడు కోట అని చెప్పవచ్చు. ఆయన విలన్ పాత్రలతో చాలా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చెయ్యని పాత్రలు లేవు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఆయన నటించి మెప్పించారు. ఆయన బాబు మోహన్ తో, బ్రహ్మానందం గారి తో చేసిన కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఇప్పటికే 650కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు ప్రాణం ఖరీదు అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీ కి మొదటి సారి పరిచయమయ్యారు.

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా తనకంటూ పరిశ్రమలో ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో కోటశ్రీనివాసరావు లేని సినిమా అంటూ ఉండేది కాదు. అంతగా ఇండస్ట్రీలో పేరుపొందాడు. ఆయన తన కుమారుడి మరణం అనంతరం మానసికంగా కృంగిపోయి కొన్ని రోజులు ఇండస్ట్రీకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం వయోభారంతో బాధపడుతున్న ఆయన కొన్ని పాత్రలను ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

Advertisement

Advertisement

హీరో వెంకటేష్ తో ఆయనకు ఉన్న బంధం చెప్పుకొచ్చారు. వెంకటేష్ నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని, వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు జనాల్లో మార్క్ ఉంటుందని అన్నారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ అంటే నాకు చాలా ఇష్టమని ఆ సినిమాను చూసి ఇప్పటికీ నవ్వుకుంటానని, దీనికి ప్రధాన కారణం ఈవీవీ సత్యనారాయణ గారు అన్నారు. నా ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య అని, ఆమె అందం, చందం,నటన, మర్యాద, క్రమశిక్షణ ఎప్పటికీ మరిచిపోలేననీ తెలిపారు. ఇప్పటికీ ఆమెను ఒక కూతుర్ల భావిస్తానని నాకు నచ్చిన హీరోయిన్ అంటే సౌందర్య అనీ, కానీ చిన్నతనంలోనే దేవుడు తీసుకెళ్లాడని చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు.

ALSO READ :

చిన్న పిల్లవాడి కథ చెబుతున్న హీరో యష్.. ఏమన్నారంటే..!!

 

నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

 

 

 

Visitors Are Also Reading