Home » స్వాతిముత్యం ఫేమ్ దీప గుర్తుందా… ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..!

స్వాతిముత్యం ఫేమ్ దీప గుర్తుందా… ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..!

by AJAY
Published: Last Updated on
Ad

చాలా మంది న‌ట‌న‌పై ఆస‌క్తితో ఇండ‌స్ట్రీలోకి వ‌స్తారు కానీ కొంత‌మంది మాత్రమే తమ మార్క్ తో ప్రేక్ష‌కుల హృదయాల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటారు. అలా ప్రేక్ష‌కుల హృద‌యాల‌లో నిలిచిపోయిన ఒక‌ప్ప‌టి హీరోయిన్ దీప‌. స్వాతిముత్యం సినిమాలో దీప సుబ్బులు అనే పాత్రలో న‌టించి ఆక‌ట్టుకుంది. నిజానికి దీప అస‌లు పేరు ఉన్ని మేరీ కాగా ఆమె కేవ‌లం తెలుగు, త‌మిళ సినిమాల కోస‌మే త‌న పేరును దీప‌గా మార్చుకుంది.

Advertisement

ఇక అప్ప‌ట్లో శృంగార స‌న్నివేశాలు చేయాలంటే హీరోయిన్ లు ఒప్పుకునేవాళ్లు కాదు. వాటికోసం ప్ర‌త్యేకంగా న‌టిమ‌ణులు ఉండేవారు. సినిమాలో ఏదైనా సీన్ కోసం అవ‌స‌రం ప‌డితే వారినే పిలిపించుకునేవారు.ఇక హీరోయిన్ లు అలాంటి సీన్ల‌కు అస్స‌లు ఒప్పుకునేవారు కాదు. కానీ దీప ఆ హ‌ద్దుల‌ను చెరిపేసింది. నాభి అందాల ప్ర‌ద‌ర్శ‌న తో పాటూ మొత్తం చీర లేకుండా కూడా న‌టించి అంద‌ర్నీ అవాక్క‌య్యేలా చేసింది.

Advertisement

మొద‌ట మ‌ల‌యాళంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ త‌ర‌వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాల‌ను చేసింది. 1972 సంవ‌త్స‌రం నుండి ప‌ది సంవ‌త్స‌రాల పాటూ వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. దీప తెలుగులో దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌, డుడు బ‌స‌వ‌న్న‌, అంద‌మే ఆనందం, లేడీస్ టైల‌ర్ , కుటుంబ గౌర‌వం సినిమాల‌తో పాటూ మ‌రికొన్ని మంచి సినిమాలు చేసింది.

ఇక దీప 1982లో రెజోయ్ అనే కాలేజీ లెక్చ‌ర‌ర్ ను వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర‌వాత కూడా గ్లామ‌ర్ పాత్ర‌ల‌లో న‌టిస్తూ వ‌రుస సినిమాలు చేసింది. ఇక రెజోయ్ దీప‌ల‌కు ఒక కుమారుడు ఉన్నాడు. అతకి వివాహం కూడా జరిగిపోయింది. ప్ర‌స్తుతం దీప కుంటుంబంగా హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

ALSO READ : 

మొదటి భార్య అనితతో దిల్ రాజుకు గొడవలు…ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు…!

ఆ హీరోయిన్ అంటే కోట శ్రీనివాసరావుకు చాలా ఇష్టమట.. కానీ ఏం చేస్తాం..!!

Visitors Are Also Reading