Home » ఐరన్ లోపం తో బాధ పడుతున్నారా..? వీటిని తీసుకోండి మరి..!

ఐరన్ లోపం తో బాధ పడుతున్నారా..? వీటిని తీసుకోండి మరి..!

by Sravya

మీరు ఐరన్ లోపంతో బాధపడుతున్నారా..? ఐరన్ లోపం నుండి బయట పడాలనుకుంటే ఇలా చేయండి. సులభంగా ఐరన్ లోపం సమస్య నుండి బయటపడొచ్చు. ఐరన్ లోపం ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఐరన్ లోపం ఉండదు. బీట్ రూట్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బీట్రూట్ ని తీసుకోవడం వలన హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. పాలకూరతో కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచుకోవచ్చు. ఇందులో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది.

రెగ్యులర్ గా పాలకూరను తీసుకుంటే, హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. గుడ్లు తీసుకోవడం వలన ప్రోటీన్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా పొందొచ్చు. ఐరన్ లోపం ఉన్నట్లయితే గుడ్లుని కూడా రోజు తీసుకోండి. రోజు ఒక గుడ్డు ని ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళు తీసుకోవాలి. గుమ్మడి గింజలు రక్తహీనతతో బాధపడే వాళ్ళకి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్ తో పాటుగా ఐరన్, జింక్ కూడా ఉంటాయి. గుమ్మడి గింజల్ని తీసుకుంటే కూడా రక్తహీనత సమస్య ఉండదు. బచ్చలి, ఉల్లిపాయలు కూడా ఐరన్ లోపాన్ని తగ్గిస్తాయి. ఇలా ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్గా తీసుకుంటే ఐరన్ లోపం ఉండదు.

Also read:

 

Visitors Are Also Reading