Home » మళ్ళీ బ్యాట్ పట్టనున్న మిథాలీ… రిటైర్మెంట్ బ్యాక్…?

మళ్ళీ బ్యాట్ పట్టనున్న మిథాలీ… రిటైర్మెంట్ బ్యాక్…?

by Azhar
Ad

ఇండియాలో క్రికెట్ అనేది చాలా పెద్ద ఆట. మన దేశీయ క్రీడా అయిన హాకీ కంటే ఎన్నో రేట్లు ఇప్పుడు ఈ క్రికెట్ అనేది మన దేశంలో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఒక్కపుడు ఇండియాలో క్రికెట్ అంటే కేవలం పురుషుల క్రికెట్ మాత్రమే అనుకునేవారు. కానీ ఈ మధ్య కాలంలో మహిళల క్రికెట్ కు కూడా అభిమానులు బాగానే పెరుగుతున్నారు. అయితే ఇప్పుడు మహిళా క్రికెట్ పేరు చెప్పగానే.. చాలా మందికి గుర్తుకు వచ్చే మొదటి పేరు మిథాలీ రాజ్. టీమిండియా మహిళల జట్టుకు ఎన్నో ఏళ్ళు కెప్టెన్ గా వ్యవరించిన మిథాలీ.. వారికీ ఓ గుర్తింపు అనేది తెచ్చింది.

Advertisement

కానీ తాజాగా మిథాలీ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కారణాలు ఏంటో తెలియకపోయిన మిథాలీ ఈ మధ్యే 23 ఏళ్ళ తన సుదీర్ఘ క్రికెట్ కెరియర్ కు రిటర్మెంట్ అనేది ప్రకటించింది. దాంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె ఎందుకు ఇలా చేసిందో యద్ధం కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మిథాలీ బ్యాట్ పట్టనుందా.. క్రీజులోకి రానుందా అంటే అవును అనే హింట్ ను ఇచ్చింది మిథాలీ. కానీ మిథాలీ ఆడేది ఆంథ్రతియా క్రికెట్ లో కాదు. వచ్చే ఏడాది నుండి మహిళల కోసం బీసీసీఐ కొత్తగా ప్రారంభిస్తున్న మహిళల ఐపీఎల్ లీగ్ లో.

Advertisement

తాజాగా ఐసీసీకీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మిథాలీ మాట్లాడుతూ… నేను ఇంకా ఐపీఎల్ కు వీడ్కోలు అనేది పలుకలేదు.ఆ ధీ ఇంకా ఓపెన్ లోనే ఉంది. కానీ అందులో ఆడాలా వద్ద అనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అయితే ఈ మహిళల ఐపీఎల్ అనేది ప్రారంభం కావడానికి ఇంకా చాలా రోజులు ఉంది. కాకపోతే మొదటి మహిళల ఐపీఎల్ సీజన్ లో ఆడటం అనేది చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది అని మిథాలీ పేర్కొంది. అయితే మిథాలీ చేసిన ఈ కామెంట్స్ తర్వాత ఆమె ఐపీఎల్ లో భాగం కనునట్లే అర్ధం అవుతుంది. అయితే బీసీసీఐ ఈ మధ్యే వచ్చే ఏడాది నుండి ఆరు జట్లతో మహిళల ఐపీఎల్ ను కూడా పురుషుల ఐపీఎల్ మాదిరే నిర్వహస్తం అని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ గురించి ఒక్క ముక్కలో చెప్పిన అక్తర్..!

భారత్ విజయానికి ఐపీఎల్ కారణమంటున్న కెప్టెన్..!

Visitors Are Also Reading