Home » తప్పు చేసి సమర్ధించుకుంటున్న ఆస్ట్రేలియా..!

తప్పు చేసి సమర్ధించుకుంటున్న ఆస్ట్రేలియా..!

by Azhar
Ad

ఆస్ట్రేలియాలో క్రికెట్ అనేది చాలా పెద్ద గేమ్. ఆ జట్టుకు కూడా ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంది. దానితో పాటుగానే మరి గుర్తింపు ఉంది.మోసాలు చేయడానికి క్రికెట్ లో ఆస్ట్రేలియా పెట్టింది పేరు. అది పురుసుగుల జట్టు అయినా… మహిళల జట్టు అయినా క్రికెట్ లో మోసాలు చేయడంలో ఫస్ట్ ఉంటారు. ఇప్పటికే ఈ విషయాన్ని పురుషుల జట్టు నిరూపించగా.. మహిళల జట్టు ఇప్పుడే నిరూపించుకుంది.

Advertisement

తాజాగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్స్ కు వెళ్లాయి. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా ఇంకా వదలలేదు కాబట్టి.. ఏ ప్లేయర్ కు అయినా సరే కరోనా అనేది సోకితే వారిని ఐసోలేషన్ కు పంపించాలి. కానీ ఇండియాతో ఫైనల్ మ్యాచ్ ముందు ఆసీస్ ఆల్ రౌండర్ తహిలా మెక్‌గ్రాత్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణగా అయ్యింది. కానీ లక్షణాలు లేవు. ఇక ఈ టోర్నీలో మొత్తం బాగా రాణించిన కారణంగా కరోనా ఉన్న కూడా ఆమెతో మ్యాచ్ ఆడించింది ఆసీస్. దాంతో ఆ జట్టుపై విమర్శలు అనేవి ఎక్కువయ్యాయి.

Advertisement

కానీ తప్పు చేయడం మాత్రమే కాకుండా ఇప్పుడు దానిని సమర్ధించుకున్నారు ఆసీస్ ప్లేయర్స్. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ సోదరి.. క్రికెటర్ అన్నా లానింగ్ ట్విట్టర్ వేదికగ స్పందిస్తూ.. కరోనాతో ఆడి కూడా ఆమె ఆస్ట్రేలియాకు ఏం లాభం చేయలేదు. కేవలం రెండు పరుగులు చేసి.. రెండు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి.. ఇండియా జట్టుకే సహాయం చేసింది అని పేర్కొంది. ఇక ఇప్పుడు ఈ అన్నా లానింగ్ చేసిన కామెంట్స్ వల్ల ఇప్పుడు విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి.

ఇవి కూడా చదవండి :

కెప్టెన్ల మార్పు మంచిదే అంటున్న రోహిత్..!

మళ్ళీ సర్జరీ చేసుకున్న అక్తర్.. ఎన్నోసారి అంటే…?

Visitors Are Also Reading